MuluguPoliticalTelangana

సీతక్క మా ట్రాక్టర్ ట్రక్ జాడ ఏది.?

సీతక్క మా ట్రాక్టర్ ట్రక్ జాడ ఏది.?

సీతక్క మా ట్రాక్టర్ ట్రక్ జాడ ఏది.?

“ఒకటికి రెండు శాఖలను మినిస్టర్ రూల్ చేసినందుకే పంచాయతీ ట్రాక్టర్ ట్రక్కు పై అశ్రద్ధ నా.?”

“ఒకరికి ఇద్దరు మంత్రులు మండలానికి రాగలుగుతున్నారు కానీ, ట్రక్ ఆచూకీ కనిపెట్టలేక పోతున్నారు..”

“గ్రామ సభలో సర్పంచ్ మౌనం వెనకాల దాగి ఉన్న, “హస్తం” ఎవరిది.?”

“గ్రామ సభలో అధికారులను నిలదీసిన గ్రామస్తులు. గ్రామస్తుల ప్రశ్నలకు నీళ్లు మింగిన అధికారులు..”

“గ్రామ సభలో అధికారులకు ఎదురుదెబ్బ.”

“ములుగు జిల్లా వెంకటాపురం మండలం మినీ గ్రామపంచాయతీ లో దారుణం.”

“రాత్రి వేళలో గ్రామసభ ఆహ్వాన ప్రచారంపై పలు రకాల అనుమానాలు.?”

“ప్రభుత్వం మెప్పు కోసమే గ్రామ సభ కొనసాగిస్తునట్టుగా, ప్రతిపక్ష పార్టీల ఆరోపణ..”

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్.”

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ శాఖ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా. ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి చేర్చాలి అనే ఉద్దేశంతో… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలనే – ప్రగతి పాలన, అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ది 02:04:2026 న మండలాల వారీగా సకల అధికారుల సమక్షంలో గ్రామసభ ఏర్పాటు కార్యక్రమాలు చేపట్టారు.. ఈ క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మినీ గ్రామ పంచాయతీ గ్రామ సభలో అధికారులకు చుక్క ఎదురయింది…

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మినీ గ్రామపంచాయతీలో బడ్జెట్ కంటే” గ్రామంలో సమస్యలే ఎక్కువగా ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు… ప్రజల ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానం లేక .!

గ్రామస్తుల మాట దాటేస్తూ, ప్రభుత్వం ప్రజలకు అధికారుల ద్వారా ఏం తెలియజేయాలనుకుందో, అనే అంశాలను, మరియు అభివృద్ధి చిత్రాలను ఫోన్ ద్వారా చూపించి అధికారులు గ్రామసభలో కాలం వెళ్లబుచ్చారు.. దాదాపు రెండేళ్ల పై మాటే” మినీ గ్రామపంచాయతీలో పంచాయతీ ట్రాక్టర్ ట్రక్కు చోరీకి గురై…. ఇప్పటిదాకా ట్రాక్టర్ ట్రక్కు జడ మాత్రం.!

ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.. ఈరోజు మినీ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన గ్రామసభలో గ్రామస్తులు మండల అధికారులపై అంగన్వాడి, త్రాగునీరు సమస్య, తడి చెత్త, పొడి చెత్త, డ్రైనేజీ వ్యవస్థ, అంటూ పలు విషయాలలో మండిపడ్డారు… గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం చెప్పిన పనులు, పథకాలు, ప్రజలకు అందచేయడం కాదు…

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులది అన్న విషయాన్ని గ్రామస్తులు గ్రామసభలో గ్రామ అధికారులకు మరోమారు గుర్తు చేశారు… మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలతో విసిగి చెందిన జనం గ్రామ సభలో గ్రామ అధికారులకు చెమటలు పట్టించే ఉంటారు అనే అంశం ప్రజల్లో ఒక సందేహంగానే కొనసాగుతుంది…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button