
అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలక్షన్ లిస్ట్ విడుదల…త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల
Web desc : తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవలే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసేందుకు 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజా సెలక్షన్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం సాయంత్రం విడుదల చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని వివిధ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది చివరలో బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీలకు సంబంధించిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను శనివారం విడుదల చేసింది. వీరికి ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది.
అలాగే త్వరలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కసరత్తు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.త్వరలోనే మిగిలిన 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
పోస్టుల వివరాలు : గైనకాలజీ 90 పోస్టులు, అనస్తేషియా 44 పోస్టులు, పీడియాట్రిక్స్ 28 పోస్టులు , ఆర్థోపెడిక్స్ 12 పోస్టులు, మొత్తం – 174
త్వరలో 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల చేస్తాం : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను వరుసగా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా అన్నిరకాల పోస్టుల భర్తీ చేసింది ప్రభుత్వం.
ప్రజాప్రభుత్వం గడిచిన రెండున్న సంవత్సరాల్లో సుమారు 9572 పోస్టులను వైద్యఆరోగ్యశాఖలో భర్తీ చేసింది. మరో 7562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో 174 పోస్టుల భర్తీ ప్రక్రియ నేటితో ముగిసింది.
మరో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటుగా, ఈ 692 పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు కూడా ఈ నెల 7న మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది.
అలాగే మరో వారం రోజుల్లో 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను కూడా విడుదల చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
కేన్సర్ పేషెంట్లకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అధునాతన LINAC యంత్రాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
ఇందులో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం, ట్రామా కేర్ పాలసీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్, PC&PNDT, ART సరోగసీ పోర్టల్స్ ప్రారంభం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు.
అనంతరం, ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి దోహదపడేలా సమర్థంగా నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.



