Andhra PradeshPolitical

ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మ*హత్యాయత్నం..

ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మ*హత్యాయత్నం..

ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మ*హత్యాయత్నం..

Web desc : రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రూ.5 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తెగేసి చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్ స్టాగ్రామ్ లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తనకు రూ.5 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

మనస్తాపంతో రాగశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రాగశ్రీ మరణించింది. కూతురి ఆత్మహత్యపై తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో తనకూతురిని లీలా కుమార్ ఇబ్బంది పెట్టాడని, అతన్ని అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. రాగశ్రీ ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button