Uncategorized

ఖమ్మంలో మంత్రి పువ్వాడకు షాక్…

ఖమ్మంలో మంత్రి పువ్వాడకు షాక్

ఖమ్మంలో మంత్రి పువ్వాడకు షాక్

ఖమ్మం జిల్లా:
మొదటి రౌండ్ :

ఖమ్మం : 605 కాంగ్రెస్ లీడ్

సత్తుపల్లి :259 బి ఆర్ ఎస్ లీడ్

పాలేరు: 2230 కాంగ్రెస్ లీడ్

మధిర :2198 కాంగ్రెస్ లీడ్

ఇల్లందు : 1360 కాంగ్రెస్ లీడ్

వైరా: 1260 కాంగ్రెస్ లీడ్

ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కు షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలోనే మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.

సూర్య – ఉమ్మడి నల్గొండ జిల్లా

నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్స్ వివరాలు…

నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….4619

దేవరకొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….1424

మిర్యాలగూడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….2569

మునుగోడు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….1494

నకిరేకల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….1910

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….1958.

సూర్యాపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….3153

కోదాడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…2638

హుజూర్నగర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….2143

తుంగతుర్తి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు….1530

భువనగిరి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1031

ఆలేరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1132

తెలంగాణలో కీలక స్థానాలు.. ముందంజలో ఉంది వీరే!

హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. వేములవాడ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కొండంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉండగా.. కామారెడ్డి, కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ లలో బీజేపీ ముందంజలో ఉంది. సిద్ధిపేట పోస్టల్ బ్యాలెట్ లో హరీష్ రావు ముందంజలో ఉన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లిలో కాంగ్రెస్ ఉంది.

ఆధిక్యంలో రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు.

కామారెడ్డిలో బీజేపీ ముందంజ

కామారెడ్డిలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ

తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 18, బీజేపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

బండి సంజయ్ ముందంజ

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు షాక్.. కొల్లాపూర్‌లో బర్రెలక్క ముందంజ

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా సాగుతోంది. ఓవరాల్‌గా అనూహ్య రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు ప్రదర్శించారు.

ఇక ఎవరూ ఊహించని విధంగా కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష) ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించి అందరినీ షాక్‌కు గురిచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button