
TST, MTS పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల… చెక్ చేసుకోండి ఇలా..
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) అభ్యర్థులకు కీలక అప్డేట్ అందించింది. మార్చి 29న నిర్వహించిన రాత పరీక్షల ప్రిలిమినరీ కీని బోర్డు అధికారికంగా విడుదల చేసింది.
అభ్యర్థులు తమ ఫలితాలను సరి చూసుకోవడంతో పాటు, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా వెల్లడించేందుకు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు మార్గదర్శకాలు జారీ చేశారు. నియామక ప్రక్రియలో భాగంగా ఈ ప్రాథమిక కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ముఖ్యమైన వివరాలు, మార్గదర్శకాలు : గత నెల 29న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించిన TST, MST పరీక్షల ప్రాథమిక కీని నేడు అధికారిక వెబ్సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ , పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కీపై ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే.. వాటిని ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు వెబ్సైట్లోని నిర్ణీత టెంప్లేట్ ద్వారా తెలియజేయాలి.
అభ్యంతరాలు, ఫీజు వివరాలు : మీరు కీలో ఏదైనా తప్పు ఉందని భావిస్తే.. ప్రతి అభ్యంతరానికి రూ. 500 ఫీజు ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది.
మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అని బోర్డు కమిటీ ఒప్పుకుంటే.. కట్టిన ఆ 500 రూపాయలను మీకు తిరిగి ఇచ్చేస్తారు (రీఫండ్). ఈ ప్రాసెస్ అంతా మీ పర్సనల్ లాగిన్ ద్వారానే చేయాలి. అలాగే.. అభ్యంతరానికి సంబంధించి సరైన ఆధారాలు కచ్చితంగా జత చేయాలి.




