KhammamPoliticalTelangana

ఏన్కూర్ లో రేషన్ పంపిణీలో అక్రమాలు...!

ఏన్కూర్ లో రేషన్ పంపిణీలో అక్రమాలు...!

ఏన్కూర్ లో రేషన్ పంపిణీలో అక్రమాలు…!

మండలవ్యాప్తంగా రేషన్ కోత వివాద ఆరోపణలు

పేదల బియ్యంపై కత్తెర – బాధ్యులపై చర్యలు ఎప్పుడు?

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 07 2026: ఏన్కూరు మండలం పరిధిలోని తూతక్క లింగన్నపేట గ్రామ పంచాయతీ రేషన్ షాపులో బియ్యం పంపిణీ వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ప్రభుత్వమే పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యం సరైన తూకంతో ఇవ్వాల్సిన సమయంలో, గోనెసంచులతో తూకం వేయడం ద్వారా లబ్ధిదారులకు నష్టం కలిగిస్తున్నారని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా తీసిన ఫోటోలో కూడా గోనెసంచులను నేరుగా తూకం యంత్రంపై ఉంచి బియ్యం కొలుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

తూకం యంత్రంపై గోనెసంచులతోనే బియ్యం కొలవడం వల్ల సంచుల బరువు కూడా కలిసిపోతూ, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పరిమాణం తగ్గుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. తూకం వేసే సమయంలో బస్తా బరువును (తారం) సరైన విధంగా తీసివేయకుండా తూకం వేయడం ప్రధాన కారణమని చెబుతున్నారు.

లబ్ధిదారుల వివరాల ప్రకారం, ప్రతి బస్తాకు సుమారు అరకేజీ వరకు బియ్యం తక్కువగా వస్తోందని వెల్లడించారు. అంతేకాకుండా కొన్నిసార్లు ప్లాస్టిక్ సంచుల్లో తూకం పెట్టి తూకం పూర్తయ్యాక కూడా గోన సంచికి తూకనికి సరిపడా బియ్యాన్ని తిరిగి తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల పేద కుటుంబాలు మరింత నష్టపోతున్నాయని బాధితులు వాపోతున్నారు.

ఈ విషయంపై రేషన్ షాపు నిర్వాహకులను ప్రశ్నిస్తే, “బస్తా తారం తీస్తున్నాం” అని సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ప్లాస్టిక్ సంచులు లేదా ఖాళీ డబ్బాలతో తూకం వేస్తే అసలు బరువు స్పష్టంగా తెలుస్తుందని, గోనెసంచులతో తూకం వేయడం వల్లే మోసం జరుగుతోందని వారు అంటున్నారు.

ఇదే సమస్య ఏన్కూరు మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా కొనసాగుతున్నదని స్థానిక లబ్ధిదారుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇదే విధంగా గోనెసంచులతో కాటా పెట్టి తక్కువ బియ్యం ఇస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీంతో రేషన్ పంపిణీపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోంది.

రేషన్ పంపిణీ కేంద్రాలలో పారదర్శకత లేకపోవడం, పర్యవేక్షణ లోపించడం వల్లే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి, తూకం యంత్రాల పనితీరును పరీక్షించి, సరైన విధంగా పంపిణీ జరుగుతోందో లేదో పరిశీలించాలని వారు కోరుతున్నారు.

ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం సరైన వారికి పూర్తి పరిమాణంలో అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button