
ప్రియుడి మోజులో ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న అసభ్యకర కాల్ ఆడియో రికార్డులు?
Web desc : కారేపల్లి : ప్రియుడి మోజులో పడిన ఓ వితంతువు నేడు ప్రాణప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీనికి కారణం సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ ఏడేండ్ల క్రితం ఓ ప్రమాదంలో భర్తను కోల్పోయింది. అనంతరం సంబంధిత మహిళ తన పిల్లలతో కలిసి భర్తకు చెందిన ఇంట్లోనే కాలం వెల్లదిస్తోంది.
ఈ క్రమంలో పొరుగు గ్రామానికి చెందిన, భార్య, పిల్లల్ని సైతం కలిగి ఉన్న ఓ వ్యక్తి విసిరిన మాయ వలలో ఈమె చిక్కుకుంది. ఈ క్రమంలో ప్రియుడి మాయ మాటలు విని కన్న పిల్లలపై కనికరం చూపించకుండా నేడు కలుపు మందు సేవించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నేడు మండలంలో కలకలం రేపుతోంది.
అయితే భార్య పిల్లలు కలిగి ఉన్నా కూడా, సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వ్యక్తి అసభ్యకర మాటలతో ఉన్న సంభాషణ, కాల్ రికార్డింగులు ప్రస్తుతం లీక్ అవ్వడంతో విన్న స్థానికులు సైతం విస్తుపోతున్నారు.
రాక్షసానందాన్ని పొందుతున్నాడనే ఆరోపణలు
సదరు మహిళ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడడం, గ్రామంలో వారి పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేలా వారి ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తూ పలు సందర్భాల్లో రెచ్చగొట్టిన క్రమంలోనే స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, సదరు మహిళనే పావు లాగా వాడుకుని తన ద్వారానే, తన సొంత కుటుంబ సభ్యులపైనే కేసులు పెట్టించే చర్యలకు పూనుకుని, సదరు వ్యక్తి రాక్షసానందాన్ని పొందుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది.
మరో వైపు కేసుల బారిన పడి కుటుంబం మొత్తం నష్టపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో మొత్తం వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన సదరు వ్యక్తి ఏమైనా చట్ట పరమైన చర్యలకు బాధ్యుడు అవుతారా? లేదా? అనే ప్రశ్న ప్రజల్లో ఆందోళన కల్గిస్తోంది. ఈ ఘటనపై ఎస్సై బైరు గోపి వివరణ కోరగా.. సంబంధిత కేసు దర్యాప్తు దశలో ఉందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



