
మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ బస్సు ధ్వంసం
Social media viral : మద్యం మత్తులో ఆడి కార్ తో యువకులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. మాదాపూర్ లోని గూగుల్ ఆఫీస్ దగ్గర ఆర్టీసీ బస్సు వెళ్తుండగా కారును అడ్డుపెట్టి డ్రైవర్ తో యువకులు వాగ్వాదానికి దిగారు.
ఓవర్ టేక్ చేసి బస్సుకు అడ్డంగా కారు నిలిపిన యువకులు డ్రైవర్ పై దాడికి దిగారు. బస్సు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. అటువైపుగా వెళ్తున్న బైకర్ కు రాయి తగిలి తీవ్రగాయాలయ్యాయి.
ఆ తర్వాత ఇద్దరు యువకులు, యువతి కారులో పరారయ్యారు. బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గతరాత్రి మాదాపూర్ లో అమానుషం : మాదాపూర్ పరిధిలోని మైండ్ స్పేస్ వద్ద ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని ఢీ కొట్టిన డ్రైవర్ కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు.
కొద్దిదూరం వెళ్లాక భర్త పక్కకు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్కూటీపైనే ఉన్న డ్రైవర్ కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లడంతో స్థానికులు గమనించి ఆపగా.. వాహనాన్ని వదిలి పరారయ్యాడు.
ప్రస్తుతం అబ్దుల్ బాసిత్ గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరూ మలబార్ గోల్డ్ షాపులో పనిచేస్తున్నారు. సినిమా చూసి, తిరిగి మహేశ్వరం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే డీసీఎం డ్రైవర్ కావాలనే ఈ పనిచేశాడా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.



