
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉంటే చాలు..
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ) స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 8. విభాగాల వారీగా ఖాళీలు : సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2, లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -1 4, జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ 1, ఎలక్ట్రీషియన్ 1.
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, స్టెనోగ్రఫీలో నైపుణ్యం, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిగ్రీ లేదా డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
లాస్ట్ డేట్ : ఏప్రిల్ 27.
సెలెక్షన్ ప్రాసెస్ : డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ svpnpa.gov.in ను సందర్శించండి.



