
యువ పారిశ్రామికవేత్త ఆత్మ*హత్య….
శేరిలింగంపల్లి : యువ వ్యాపారవేత్త ఆత్మ*హత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గచ్చిబౌలి మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి (30) ఈ నెల 12న వివాహం చేసుకోబోతున్నారు. వివాహ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, వైజాగ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ షూటింగ్ కోసం సుమారు రూ.20 లక్షలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.
ఇలాంటి సమయంలో, పెళ్లికి కేవలం ఐదు రోజుల ముందే వెంకట కృష్ణ ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆత్మహత్యకు ముందు తన సోదరుడికి మెసేజ్ పంపిన అనంతరం, పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుని, కత్తితో గొంతు కోసుకున్నాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మానసిక వేదనలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సమాచారం. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.




