
సింగర్ మంగ్లీపై కేసు నమోదు…
Social media viral : సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయ్యింది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసం చేసిందనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మంగ్లీ మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని బెదిరించిందని ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాదాపు 150 మందిని మోసం చేశారని, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడి ఆరోపించాడు. మంగ్లీతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
సింగర్ మంగ్లీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసం చేయడమే కాకుండా.. బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితులు, పోలీసుల సమాచారం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు సమాచారం.
అయితే.. కాలం గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెందారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు.
బాధితుల తరపున ఆయన ఈ వ్యవహారంపై స్పందించడంతో అసలు గొడవ మొదలైంది. బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో న్యాయవాది నిలదీయగా.. మంగ్లీ, ఆమె బృందం నుంచి బెదిరింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.
సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని వారు హెచ్చరించారని.. ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
ఈ బెదిరింపుల వ్యవహారంలో దర్శకుడు వేణు ఊడుగుల పాత్ర కూడా ఉందని న్యాయవాది పోలీసులకు తెలిపారు. న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు.. ప్రాథమిక విచారణ అనంతరం మంగ్లీ, శివ, వేణు ఊడుగుల, ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని న్యాయవాది కోరడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపి నిజానిజాలను నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. సింగర్ మంగ్లీ ఇటీవల కూడా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా చిత్రం ‘KD: ది డెవిల్’లో మంగ్లీ పాడిన ‘సర్కే చునార్ తేరి సర్కే’ అనే సాంగ్ లిరిక్స్ నెట్టింట పెను దుమారం రేపాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ పాటలోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, మేకర్స్ వెంటనే స్పందించి ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు.
ఈ వివాదంపై సింగర్ మంగ్లీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేస్తూ.. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు.
“నేను ఎప్పుడూ ప్రజల మనోభావాలను గౌరవిస్తాను. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు పట్ల నేను చాలా బాధపడుతున్నాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ పాటలోని వివాదాస్పద సాహిత్యాన్ని ఇప్పటికే మార్చారు.
త్వరలోనే అప్డేట్ చేసిన కొత్త సాంగ్ ను విడుదల చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని హామీ ఇస్తున్నాను” అని మంగ్లీ పేర్కొన్నారు.



