
గర్భిణి స్త్రీల ఆహ్వానం కార్యక్రమం నిర్వహణ.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో..1&2 అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడలో భాగంగా గర్భిణి స్త్రీల ఆహ్వానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ సర్పంచ్ వేపూరి పద్మ హాజరై.. ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలో నిర్వహించే యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నారు.
అనంతరం గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.
0-5 ఐదు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రంలో నమోదయ్యేలా చూడాలన్నారు. మరియు గర్భిణీ స్త్రీలకు పిల్లలకి ఇమేజెస్ కార్యక్రమం నిర్వహించి గర్భిణీ స్త్రీలకు HB టెస్ట్ లను నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో… ఉప సర్పంచ్ చాట్ల శ్యామల, వార్డు మెంబర్ చాట్ల లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు లేయమ్మ. అలివేలు మంగమ్మ, ఏఎన్ఎం సరళ, M.L.H.P మధుమై, ఆశా వర్కర్ దేవమణి,గర్భిణీ బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు



