
తిర్లాపురం గ్రామంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం తిర్లాపురం గ్రామంలో శనివారం నాడు తిర్లాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు హాజరై జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి పూలదండ వేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ…..మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకుంటారు. 19వ శతాబ్దపు గొప్ప భారతీయ సంఘ సంస్కర్త, విద్యారంగ సంస్కర్త, మరియు కుల వ్యతిరేక ఉద్యమకారుడైన పూలే, మహిళా విద్య మరియు దళిత/బహుజన అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన సేవలకు గుర్తుగా ఈ రోజును స్మరించుకుంటారు. జననం ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు.
సామాజిక సేవలో భాగంగా అంటరానితనం నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
స్త్రీ పట్ల విద్య కోసం తన భార్య సావిత్రీబాయి పూలేతో కలిసి 1848లో పుణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు.
సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో సమాజంలో సమానత్వం కోసం ‘సత్యశోధక్ సమాజ్’ (సత్య శోధక సమాజం) ను స్థాపించారు.
జ్యోతిరావు ఫూలే సామాజిక సేవలను గుర్తించి, 1888లో ‘మహాత్మా’ బిరుదు ఇచ్చి సత్కరించారు.
జ్యోతిరావు పూలే గురించి భావితరాలకు ఈ సందర్భంగా తెలియజేశారు బ్రాహ్మణాధిస్వాతిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారికి కూడా బోధించవలసిరావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో “బాలహత్య ప్రతిబంధక్ గృహ” స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. జ్యోతిరావు పూలే కొనియాడారు. ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని తెలంగాణలో పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం, అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ స్వాతి, ప్రీతం,అంగన్వాడి టీచర్ నాగ సీతారత్నం, ఏ ఎన్ ఎం.రాజ్యం, నరసింహారావు,ఆశా వర్కర్ చాపలమడుగు రాణి, శౌరి,సైదులు, సీతారాములు, చాట్ల అశోక్, నరేష్, అంజమ్మ,యువతీ, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



