EntertainmentHyderabadPoliticalTelangana

యాంకర్ విష్ణుప్రియ పై కేసు నమోదు…?

యాంకర్ విష్ణుప్రియ పై కేసు నమోదు…?

యాంకర్ విష్ణుప్రియ పై కేసు నమోదు…?

Social media viral : బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న వీడియో చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు శనివారం రోజు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్‌, మరికొందరు విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ షోల్లో యాంకర్‌గా అందరినీ నవ్వించే విష్ణుప్రియ..

ఇలా డబ్బుల కోసం కక్కుర్తి పడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ నేతలు విమర్శించారు. విష్ణుప్రియ విద్యార్థులు, యువతను ఆకట్టుకునేలా అసభ్యకరమైన వీడియోలు పెడుతున్నారని ఆరోపించారు. సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటూ రూ.390 వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సెలబ్రిటీలు అందరికి ఆదర్శంగా నిలవాలని.. ఇలా అర్ధనగ్న వీడియోలో పేరుతో ప్రకటనలు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలని.. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

విష్ణుప్రియ టీవీ షోలతో ఫేమస్ అయ్యారు.. ఆమె మంచి యాంకర్‌గా పాపులారిటీ సంపాదించారు. ఆమె యాంకరింగ్‌తో పాటుగా కొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా చేశారు.

అయితే కొంతకాలంగా విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామర్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆమె బోల్డ్ లుక్స్‌తో ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అయ్యారు.

ఆమె బోల్డ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో సబ్‌స్క్రైబర్లకు అందిస్తున్నారు. ఇలా ఆ బోల్డ్ కంటెంట్‌ను అందిస్తుందన్నందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విష్ణుప్రియ ఎపిసోడ్‌పై చర్చ జరుగుతోంది.

అందుకే ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆమెపై విజయవాడలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..

దీంతో విష్ణుప్రియ ఎపిసోడ్ హాట్‌టాపిక్ అవుతోంది. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై యాంకర్ విష్ణుప్రియ స్పందించాల్సి ఉంది. అలాగే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button