Bhadrachalam
Trending

ఆదివాసి మహిళలకు తప్పని తిప్పలు.

ఆదివాసి మహిళలకు తప్పని తిప్పలు.

ఆదివాసి మహిళలకు తప్పని తిప్పలు.

  • రహదారి సౌకర్యం లేక పురిటి నొప్పులతో గర్భిణి అవస్థలు.
  • మంచానికి కట్టి తీసుకువెళ్లిన స్థానికులు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పినపాక ప్రతినిధి, (సాయి కౌశిక్),

జూన్ 08,

మారుమూల ఏజెన్సీ గ్రామాల వాసులకు తిప్పలు తప్పడం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గర్భిణులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది.
ఆదివాసీ మహిళలు, ముఖ్యంగా గర్భిణులు, రహదారి సౌకర్యం లేకపోవటం వల్ల పురిటి నొప్పుల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి అంబులెన్స్ వెళ్లడానికి వీల్లేక, రోడ్డు మార్గం లేకపోవటం వల్ల వారు ఆసుపత్రికి చేరడానికి చాలా కష్టపడవలసి వస్తుంది, దీనివల్ల గర్భిణీలు మరియు వారి శిశువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామపంచాయతీ ఉమేష్ చంద్ర నగర్ గ్రామంలో ఇలాంటి హృదయ విధాకర ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మొడియం జానకి అనే గిరిజన మహిళకు కి పురిటి రావడంతో రహదారి సౌకర్యం లేక మంచానికి కట్టి మోసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఉమేష్ చంద్ర నగర్ కు కనీసం రహదారి సౌకర్యం లేక ఆ పురిటి నొప్పులతోనే ఆ మహిళా పడ్డ వేదన వర్ణనాతీతం.


రహదారి లేకపోవటం వల్ల అంబులెన్స్ ఆ ప్రాంతాలకు చేరుకోలేవు, దీనివల్ల గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.రహదారి లేకపోవడంతో అక్కడే 108 రాలేక ఆగిపోయింది. దీంతో గ్రామస్థులు మంచానికి కర్రలు కట్టి గర్భిణిని అందులో పడుకోబెట్టి మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆమెను అం బులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button