Telangana
Trending

మంత్రుల పనితీరుపై సీఎం సీరియస్

మంత్రుల పనితీరుపై సీఎం సీరియస్

మంత్రుల పనితీరుపై సీఎం సీరియస్

ఇంచార్జ్‌ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇంచార్జ్‌ మంత్రులకు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయమని చెబితే వాటిని భర్తీ చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇంచార్జ్‌ మంత్రులదేనని తెలిపిన సీఎం రేవంత్‌.. ఫండ్స్‌ను సైతం ఇంచార్జ్‌ మంత్రులు సరిగా ఉపయోగించట్లేదని మండిపడ్డారు. ఇక గాంధీ భవన్‌లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్‌ సీరియస్‌గా స్పందించారు. నిరసన తెలపడానికి ఓ పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు.

పీసీసీ రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్‌.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ’18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయి లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలo గా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలుగుతాం.

పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి.. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా పని చేయాలి. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి.. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి.

మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వo అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లు,జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button