NationalPolitical

ప్రముఖ కంపెనీల దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డిభేటీ

ప్రముఖ కంపెనీల దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డిభేటీ

ప్రముఖ కంపెనీల దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డిభేటీ

హైదరాబాద్ : జనవరి 16
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుం టున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.

దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వరల్డ్ ఎకనా మిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండ్ తో సమావేశమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు.

ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య నాయకత్వం కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.

అనంతరం, ఇథియోఫియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న కార్యాచరణపై చర్చించారు.

రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ తో సమావేశమయ్యారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button