EducationNotification

స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ నుంచి బిగ్​ అప్డేట్​! 1340 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురు..

స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ నుంచి బిగ్​ అప్డేట్​! 1340 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురు..

స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ నుంచి బిగ్​ అప్డేట్​! 1340 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్- ఎలక్ట్రికల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దీంతోపాటు రిజిస్ట్రేషన్​ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా SSC JE 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జులై 21 అని గుర్తుపెట్టుకోవాలి.

ఎస్​ఎస్సీ జేఈ రిక్రూట్​మెంట్​ 2025: ముఖ్యమైన తేదీలు- వివరాలు..

ఎస్​ఎస్సీ జేఈ 2025 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: జూన్ 30 నుంచి జులై 21 వరకు.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ- సమయం: జులై 22 (రాత్రి 11 గంటల వరకు).

దరఖాస్తు ఫారమ్ సవరణ విండో: ఆగస్టు 1 నుంచి 2 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I) తాత్కాలిక షెడ్యూల్: అక్టోబర్ 27 నుంచి 31 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-II) తాత్కాలిక షెడ్యూల్: జనవరి-ఫిబ్రవరి, 2026.

దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 93063.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1,340 తాత్కాలిక ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్ట్, కేటగిరీ వారీగా తుది ఖాళీల వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఎస్​ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ 2025 కోసం వయోపరిమితి వివిధ పోస్టులకు వేరువేరుగా ఉంటుంది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలని సూచించడం జరిగింది.

ఎస్​ఎస్సీ దరఖాస్తు రుసుము రూ. 100. అయితే, మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), బెంచ్‌మార్క్ వికలాంగులు (పీడబ్ల్యూబీడీ), రిజర్వేషన్‌కు అర్హులైన మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎస్​ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు పేపర్‌లలో నిర్వహిస్తారు.

సబ్జెక్ట్​ ప్రశ్నలు/మార్కులు వ్వవధి
జెనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్​ 50/ 50 2 గంటలు
జెనరల్​ అవేర్​నెస్​ 50/ 50
పార్ట్​ ఏ- జెనరల్​ ఇంజినీరింగ్​ (సివిల్​- స్ట్రక్చరల్​) లేదా పార్ట్​ బీ- జెనరల్​ ఇంజినీరింగ్​ (ఎలక్ట్రికల్​) లేదా పార్ట్​ సీ- జెనరల్​ ఇంజినీరింగ్​ (మెకానికల్​) 100/ 100

సబ్జెక్ట్​ ప్రశ్నలు/మార్కులు వ్యవధి
100/ 300 2 గంటలు

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ని పరిశీలించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button