
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగు తీసిన భక్తులు
తిరుపతిలో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగుచూసింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో భక్తులు పరుగు తీశారు.
వివరాల ప్రకారం.. తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం ముందున్న షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఆలయం ముందున్న చలువ పందిళ్లు తగలబడ్డాయి.
స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.
రెండు దుకాణాలు దగ్ధం అయినట్లు సమాచారం. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
అయితే, ఈ ప్రమాదం సమయంలో ఘటన స్థలంలో భక్తులు(Devotees) ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, షాపులో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమయింది.