
డిగ్రీ అర్హతతో యూపీఎస్సీలో ఉద్యోగాలు, జస్ట్ ఇంటర్వ్యూతోనే ఉద్యోగం
నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, విద్యార్హత, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నంబర్ 08/2025 ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో పలు గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ గెజిటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ ద్వారా పలు టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ రంగాల్లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు జూన్ 28వ తేదీ నుంచి జులై 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య : 241
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. రీజినల్ డైరెక్టర్, సైంటిఫిక్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, తదితర పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు :
రీజినల్ డైరెక్టర్ : 01
సైంటిఫిక్ ఆఫీసర్ : 02
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 08
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 09
మేనేజర్ గ్రేడ్-I/సెక్షన్ ఆఫీసర్ : 19
సీనియర్ డిజైన్ ఆఫీసర్ : 07
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ : 20
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 01
సైంటిస్ట్-బీ : 05
లీగల్ ఆఫీసర్ : 05
డెంటల్ సర్జన్ : 04
డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ : 02
స్పెషలిస్ట్ : 72
ట్యూటర్ : 19
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ : 02
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 08
మైన్స్ సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ : 03
డిప్యూటీ డైరెక్టర్బి: 02
అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్ : 14
డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్ : 09
అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ & అసిస్టెంట్ డైరెక్టర్ : 01
నాటికల్ సర్వేయర్-కమ్-డిప్యూటీ డైరెక్టర్ : 01
అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ : 04
స్పెషలిస్ట్ గ్రేడ్-II (జూనియర్ స్కేల్) : 11
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : 01
అసిస్టెంట్ జిల్లా న్యాయవాది : 09
విద్యార్హత : ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, పీజీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు : ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు https://upsconline.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థుల వివరాలు, అర్హతలు, ఎక్స్ పీరియన్స్ ఆధారంగా స్క్రీనింగ్ జరుగుతుంది. అవసరమైతే ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.
దరఖాస్తుకు ప్రారంభ తేది : 2025 జూన్ 28
దరఖాస్తుకు చివరి తేది : 2025 జులై 17
ఉద్యోగ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ సెంటర్స్ : యూపీఎస్సీ నిర్దేశించిన సెంటర్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
జీతం : పే లెవల్స్ 7 నుంచి 12 వరకు ఉండడం వల్ల జీతాలు భారీగా ఉంటాయి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్ : https://upsc.gov.in/recruitment/