EducationNationalNotification

DRDOలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేసుకోండి ఇలా...

DRDOలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేసుకోండి ఇలా...

DRDOలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేసుకోండి ఇలా…

డీఆర్​డీఓకి చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్​ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 152 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.

కాబట్టి, అర్హుత, ఆసక్తి గల అభ్యర్థులు డీఆర్​డీఓ అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్​ చేసుకోవచ్చు. జులై 18, 2025 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. మరిన్ని వివరాలు మీకోసం.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

డీఆర్‌డీఓలో సైంటిస్ట్ ‘బీ’ 127 పోస్టులు
ఎన్‌కాడ్రైడ్ సైంటిస్ట్ ‘బీ’ 16 పోస్టులు
ఏడీఏలో సైంటిస్ట్/ఇంజినీర్ ‘బీ’ 9 పోస్టులు
ఎంపిక ప్రక్రియ:

ఈ రిక్రూట్​మెంట్​లో పాల్గొనే అర్హులైన అభ్యర్థులను తాము సాధించిన గేట్​ స్కోర్ ఆధారంగా షార్ట్‌ లిస్ట్ చేస్తారు. కేటగిరీ వారీగా మెరిట్ జాబితా ప్రకారం 1:10 నిష్పత్తిలో ఎంపిక జరుగుతుంది. షార్ట్‌ లిస్ట్ అయిన అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావలి.

అందుకోసం ఆర్​ఏసీ వెబ్‌సైట్‌లో ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ నుంచి తమకు నచ్చిన టెంటెటివ్​ ఇంటర్వ్యూ తేదీని ఎంచుకోవాలి. గేట్​ స్కోర్‌కు 80%, వ్యక్తిగత ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 20% వెయిటేజ్ కలిపి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము ఉండదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button