
తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా అస్సలు చేయకూడని పనులు ఇవే..!
హిందూ ధర్మంలో దేవశయన ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి దేవశయని ఏకాదశి 6 జూలై 2025 ఆదివారం వచ్చింది.
దేవశయన ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మంచిది. వాటిలో తొలి ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏడాది 2025లో తొలి ఏకాదశి జులై 6వ తేదీ ఆదివారం రోజు వస్తోంది.
ఈ పర్వదినంతో పాటు చాతుర్మాస్య వ్రతం కూడా ఆ రోజు నుంచే మొదలౌతుంది. ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది.
ఈ నాలుగు నెలల్లో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది భక్తులందరికీ ఆధ్యాత్మికంగా అత్యంత శుభకార్యాల సమయంగా పరిగణిస్తారు.
తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా పుణ్యం లభించడమే కాకుండా, పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.ఈ రోజున సాధ్యమైనంత వరకూ నిరాహారంగా ఉపవాసం చేయాలి.
ఉపవాసం చేయడం కష్టంగా ఉంటే, పాలు, పండ్లు తీసుకోవచ్చు. కానీ అన్నం, ఉప్పు, ధాన్య పదార్థాలను నివారించాలి.
ఈ రోజున మద్యపానం, మాంసాహారం పూర్తిగా దూరం పెట్టాలి.
ఈ పవిత్ర రోజున కొన్ని పనులు చేయడం దోషకారకంగా భావిస్తారు. ముఖ్యంగా..
తులసి దళాలను తీయకూడదు – తులసి దేవీ శ్రీమహావిష్ణువుకు ప్రియమైనదిగా భావిస్తారు. ఏకాదశి రోజున ఆమె విశ్రాంతి తీసుకుంటుందనేది విశ్వాసం, కాబట్టి ఈ రోజు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదు.
చీపుర్లను ఇంటి బయట పడేయకూడదు – ఇది సంపద వెలుపలికి వెళ్లే సంకేతంగా భావిస్తారు.
గోర్లు కత్తిరించకూడదు, కటింగ్, షేవింగ్ వంటివి చేయరాదు – ఇవి అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం.
పగటిపూట నిద్రపోకూడదు – ఈరోజు ధ్యానంలో గడపాలి. నిద్రపోవడం పుణ్య ఫలాన్ని తగ్గిస్తుంది.
ఇతరులపై నిందలు వేయడం, కోపంగా మాట్లాడటం, గొడవలు చేయడం వంటివి నివారించాలి. వీటివల్ల మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుందని భావిస్తారు.
ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ సత్యనారాయణ వ్రతం, విష్ణు అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మన ఇంటికి శుభం కలుగుతుంది.
వీలుంటే ఆలయంలో లేదా ఇంట్లో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయాలి. పసుపు, కుంకుమ, తులసి, నైవేద్యం సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలి.
ఫైనల్ గా… తొలి ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక అవకాశంగా భావించాలి.
శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత కలిగించే ఈ పవిత్ర దినాన్ని శ్రద్ధతో జరుపుకుంటే, మన జీవితంలో శాంతి, సమృద్ధి నెలకొంటాయి. ఈ ఏకాదశిని ఆధ్యాత్మిక పునరుజ్జీవన దినంగా భావించి, మనల్ని మనం రీచార్జ్ చేసుకోగలిగితే, అదే నిజమైన పూజ అని చెప్పొచ్చు.