
బిజినెస్ చేద్దాం అనుకునేవాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోండి..! ఎలా అప్లై చేసుకోవాలంటే..
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియా పోస్ట్.. కేవలం ఉత్తరాలు పంపాడానికే కాకుండా దాని సేవలు వివిధ రంగాల్లో విస్తరించిన విషయం తెలిసిందే. పార్సిల్ సర్వీస్, బ్యాంకింగ్ సేవలు కూడా ప్రారంభించింది.
మరి అలాంటి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కేవలం రూ.5000 కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
మరి ఫ్రాంచైజ్ కోసం అర్హతలు, దరఖాస్తు విధానాలు, మార్గదర్శకాలు ఏంటో చూద్దాం..
అర్హత ప్రమాణాలు
మీరు భారతీయ పౌరుడు లేదా భారత సంతతికి చెందినవారై ఉండాలి. మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీకు గతంలో ఎటువంటి క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉండకూడదు.
మీరు చట్టబద్ధమైన వ్యాపార చిరునామా, సంప్రదింపు నంబర్‌ను అందించగలగాలి. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి, వ్యక్తి గుర్తింపు పొందిన పాఠశాల నుండి చెల్లుబాటు అయ్యే 8వ తరగతి పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియలో ఒక ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించాలి. ఎంపికైన తర్వాత ఇండియా పోస్ట్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ నుండి వచ్చే ఆదాయాలు కమిషన్ పై ఆధారపడి ఉంటాయి. ఫ్రాంచైజీ పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే వివిధ ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. కమిషన్ రేట్లు ముందుగానే ఒప్పందంలో ఉంటాయి.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ ఫీజు
ఆసక్తిగల అభ్యర్థులు పోస్టాఫీస్ ఫ్రాంచైజ్ పథకంలో పాల్గొనడానికి రూ.5000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈ రుసుమును “అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్” పేరుతో తయారు చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా సమర్పించవచ్చు.
SC/ST వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, మహిళా దరఖాస్తుదారులు, ప్రభుత్వ పథకం కింద ఇప్పటికే ఎంపికైన వారికి దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంది.
కమిషన్ ద్వారా సంపాదన ఫ్రాంచైజీని పొందిన తర్వాత, మీ ఆదాయం కమిషన్ ఆధారంగా ఉంటుంది. కమిషన్ రేట్ల ఇలా ఉండొచ్చు..
రిజిస్టర్డ్ వస్తువుల ప్రతి బుకింగ్‌కు రూ.3 కమిషన్
స్పీడ్ పోస్ట్ వస్తువుల ప్రతి బుకింగ్‌కు రూ.5 కమిషన్
100 నుంచి 200 రూపాయల మనీ ఆర్డర్ల బుకింగ్ పై 3.50 రూపాయల కమిషన్.
200 రూపాయలకు పైగా మనీ ఆర్డర్లకు 5 రూపాయల కమిషన్.
రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ సేవలకు నెలకు రూ.1000 అదనపు కమిషన్.
పెరిగిన బుకింగ్‌లకు అదనంగా 20 శాతం కమిషన్ లభిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసుకోవడానికి, పోస్ట్ ఆఫీస్ అందించిన అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవడం, అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ దరఖాస్తును సమర్పించడం ముఖ్యం. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, దరఖాస్తు ప్రక్రియను కొనసాగించడానికి మీరు అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి.