
మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి, ఫర్నీచర్ మొత్తం ధ్వంసం
నెల్లూరు : కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ దాడి చేశారు.
అల్లరిమూకల దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసమైంది. కారుపై సైతం దాడి చేసి ఉల్టా పల్టా చేసి వెళ్లిపోయారు. ఇంట్లో విలువైన వస్తువులు మొత్తం పగలగొట్టారు.
ఈ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కొందరు అల్లరి మూకలు దాడికి పాల్పడ్డారు.
కోవూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో వేమిరెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, కారు ధ్వంసం చేయగం హాట్ టాపిక్ అవుతోంది. కోవూరులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.