
పదివేల రూ” పెట్టి కొంటే పది రోజులు కూడా పని చేయవా..?
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో నాసిరకపు సైకిలను అమ్ముతున్న రమాదేవి సైకిల్ షాప్.
ఏజెన్సీ ప్రాంతపు ప్రజలను ఎల్లవేళలా మోసం చేస్తున్నటువంటి యాజమాన్యం.
జిల్లా క్వాలిటీ తనిఖీ అధికారులు ఉన్నారా లేరా ?
కంప్యూటర్ బిల్లులు ఇవ్వకుండా ప్రింటింగ్ పేపర్ బిల్లుల పై వస్తువులు విక్రయిస్తున్న రమాదేవి సైకిల్ షాప్.
జిల్లా, సేల్స్ టాక్స్ అధికారులు ఉన్నారా లేరా ?
జి ఎస్ టి బిల్లులు ఇస్తే ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి వస్తుందని జి ఎస్ టి బిల్లు లేకుండా వస్తువులు విక్రయిన.
జి ఎస్ టి బిల్లు చూపెట్టకుండా ప్రింటింగ్ బిల్లులతో కోట్లల్లో ఆదాయం వెనకేసుకుంటున్న వంటి రమాదేవి సైకిల్ షాప్.
రాష్ట్ర ప్రభుత్వానికి సేల్స్ టాక్స్ ఆదాయం కు కుచ్చుటోపి పెడుతున్నటువంటి రమాదేవి సైకిల్ షాప్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
జూలై 10,
భద్రాచల పట్టణంలో బస్టాండ్ కాంప్లెక్స్ లో ఎన్నో సంవత్సరాల నుంచి సైకిల్ వ్యాపారం చేస్తూ గిరిజన ప్రజలను మోసం చేస్తు గిరిజన ప్రజల రక్తాన్ని పీల్చుకుంటూ కోట్లకు పడగెత్తిన రమాదేవి సైకిల్ షాప్ యాజమాన్యం.
26 జూన్ 2025 తేదీన భద్రాచలం పట్టణాని కి చెందినటువంటి పాయం కృష్ణ కుమారి అను గిరిజన మహిళ తిని తినక తండ్రి లేని తన మనవడినీ సంతోష పరచడానికి సైకిల్ కొనడానికి డబ్బులు దాచిపెట్టుకొని, పుట్టినరోజు సందర్భంగా తన మనవడికి సైకిల్ కొనడానికి తాను తన కూతురు మనవడు వెళ్లారు.
రమాదేవి సైకిల్ షాప్ నందు ఉన్నటువంటి యజమానిరాలు అభం శుభం తెలియని చిన్న పిల్లవాడికి తన దగ్గర ఉన్నటువంటి నాసిరకపు సైకిలను ఇదే కంపెనీ సైకిల్ పిల్లలంతా ఇదే సైకిల్ కొంటున్నారు నువ్వు కూడా కొనుక్కో అంటూ పిల్లగాడని మోసపూరితమైన మాటలు చెప్పి తాను తను దగ్గర ఉన్నటువంటి నాసిరకకు సైకిలను అక్షరాల 10 వేలు రూపాయలు కి సైకిల్ అమ్మడం జరిగినది.
సైకిల్ కొనుక్కుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన పిల్లాడి కి ఆ సంతోషం ఎన్నో గంటలు మిగల్లేదు తెచ్చిన మూడు రోజులకే సైకిలు పాడైపోవడం జరిగినది. దానిని రమాదేవి సైకిల్ షాప్ యాజమాన్యానికి ఫోన్ చేసి అడగగా ఆ సైకిల్ రిపేర్ చేసే టెక్నీషియన్ లేరు. వారం రోజుల తర్వాత తీసుకురండి చేసి పెట్టే బాధ్యత నాది అని హామీ ఇవ్వడం జరిగినది.
వారం రోజుల తర్వాత తీసుకెళ్తే ఈ వస్తువు పనిచేయదు పాడైపోయింది కొత్త వస్తు వేయాలంటే 2,500 రూపాయలు అవుతది. సైకిళ్ళకి ఎటువంటి వారంటీలు ఉండవు అని డబ్బులు ఇస్తేనే సైకిల్ బాగు చేస్తానని పిల్లవాడి మామయ్యతో రమాదేవి సైకిల్ షాప్ యజమాని దురుసుగా చిరాగ్గా సమాధానం చెప్పడం జరిగింది..
తన మామయ్య సైకిల్ షాప్ యజమానిని పాడైపోయిన వస్తువు తీసేసి మామూలు సైకిల్ లాగా చేయండి అని బతిమిలాడాడు. యజమాని డబ్బులకి కక్కుర్తి పడి సరే దీనిని 500 రూపాయలు ఇవ్వు మాములు సైకిల్ లాగా చేసి ఇస్తాను అని మరలా హామీ ఇచ్చాడు.
ఇచ్చి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి సైకిలు బాగు చేయడం జరిగినది వచ్చి తీసుకెళ్ళు అని పిల్లవాడి మామయ్యకి ఫోన్ చేసి రమాదేవి సైకిల్ షాప్ యజమాని తెలపడం జరిగినది. తన మామయ్య సైకిల్ షాప్ వద్దకు వెళ్లి తను ఒప్పుకున్నటువంటి 500 రూపాయలు యజమానికి ఫోన్ పే ద్వారా చెల్లించడం జరిగినది. డబ్బులు కట్టి సైకిల్ తీసుకెళ్లిన పది నిమిషాలకే మరల ఇంకొక వస్తువు పాడైపోవడం జరిగినది.
వెంటనే సైకిల్ షాప్ వద్దకు సైకిల్ తీసుకొని పాడైపోయిన వస్తువుని యజమాని కి చూపెట్టగా ఈ వస్తువు పాలైపోయింది మరల 15 వందల రూపాయలు ఇవ్వు బాగు చేసి పెడతాను అని యజమాని వాళ్ళ మామయ్యతో అన్నారు.
ఇదేంటి ఇప్పుడే బాగు చేసావు 500 రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఇంకొక వస్తువు పాడైపోయింది ఇట్లాంటి నాసిరక్క వస్తువులు ఎందుకు అమ్ముతున్నావు అని ప్రశ్నించగా నేను అమ్మే వస్తువుకి ఎటువంటి వారంటీలు గ్యారెంటీలు ఉండవు, నన్ను ఏ అధికారి అయినా ఏమి చేయలేడు.
మాకు సంబంధించిన అధికారులకు మేము భారీగా ముడుపులు చెల్లిస్తున్నాము మీ దిక్కున చోట చెప్పుకో అంటూ పిల్లవాడిని, వాళ్ల మావయ్యకి సమాధానం చెప్పడం జరిగినది. గిరిజన ఏజెన్సీ లాంటి. ప్రాంతంలో నాసిరకవు సైకిల్ తయారీ రమాదేవి సైకిల్ షాపు పై స్టేట్ అండ్ డిస్టిక్ క్వాలిటీ చెకప్ అధికారులు.
ఏజెన్సీ అధికారి అయినటువంటి ఐ టి డి ఎ, పి ఓ, జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ తక్షణమే రమాదేవి సైకిల్ షాప్ ను సీజ్ చేసి యజమానిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని భద్రాద్రి వాసులు వ్యాపోతున్నారు.