
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బిగ్ షాక్
సొంత గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి తీరుపై నాగిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డా కూడా ఫలితం దక్కలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు తనను ఝాన్సీరెడ్డి ఇబ్బందులకు గురిచేస్తుందని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఇటీవల ఝాన్సీరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఝాన్సీరెడ్డిని విదేశాల నుండి పిలిపించి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరామన్నారు. ఆమె గెలుపునకు ఎంతో కృషి చేశామన్నారు. కానీ గెలిచిన తరవాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
యశస్విని రెడ్డి ఓటమి కోసం ప్రయత్నించినవారినే ఇప్పుడు పక్కన పెట్టుకుని సొంతపార్టీ నాయకులను దూరం పెడుతున్నారని అన్నారు. యశస్విని రెడ్డికి మంచి చేయాలని ఉన్నా ఝాన్సిరెడ్డి వల్ల చేయలేకపోతున్నారని ఆరోపించారు.