
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటా
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తో కేటీఆర్
రాబోయే రోజుల్లో వైరా నియోజకవర్గ గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాజీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ధీమా వ్యక్తం చేశారు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతరం కేటీఆర్ తో గిరిబాబు మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ కష్టం వచ్చినా నేనున్నానని కేటీఆర్ భరోసా కి ఇచ్చారు.
ప్రతి కార్యకర్తలు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది కార్యకర్తలు ఇప్పుడే నుంచి కష్టపడి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని గిరిబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు, రాబోయే స్థానిక సంస్థల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.