
జీవో 49 నిలుపుదల పట్ల మంత్రి సీతక్క హర్షం
కొమరం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుకు బీజం వేసింది బీఆర్ఎస్సే- సీతక్క
కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుకు అన్ని పార్టీలు సంతకం చేశాయి- సీతక్క
స్థానిక ప్రజల అనుమానాల నేపథ్యంలో జీవో 49 ని నిలపివేస్తున్నట్లు ప్రకటించిన సీఎం
సీఎంను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
జీవో 49 నిలుపుదలకు చొరవ చూపిన సహచర మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపిన సీతక్క
కొమరం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం ఉద్దేశించిన జీవో 49 ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అహ్మద్ నదీం మోమో జారీ చేశారు. జీవో 49 ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయడం పట్ల పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
సీఎంను సచివాయంలో MLA వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్, ఇతర నేతలతో కలసి cm రేవంత్ రెడ్డి నీ సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వలను కలిపేందుకు వాటి మద్యలో ఉన్న ప్రాంతాన్ని కన్సర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేయాలని 2016 లోనే బీజం పడింది. జూన్ 12, 2016 నాడే దీనికి గత ప్రభుత్వం అంకుర్పార్పన చేసింది. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు మొదటి సమావేశం.. ప్రతిపాదిత ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించాలనే ప్రతిపాదనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చించింది. ఆ తర్వాత 27 ఫిబ్రవరి 2017 న రాష్ట్రవన్యప్రాణి బోర్డు రెండో సమావేశంలో నోటిఫికేషన్ కోసం అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 26, 2018 న ఛీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపదిత ప్రాంతాన్ని వన్యప్రాణులు అభయారణ్యంగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జూలై 11, 2019 లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ కు అనుభందంగా ప్రతిపాదితక ప్రాంతాన్ని ఉపగ్రహ కేంద్రంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా కన్జర్వేషన్ జోన్ గా ప్రకటించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలంగాణ అటవి శాఖను ఆదేశించింది. ఈ ప్రక్రియను కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ గుడెం నగేష్, బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మద్దతుతో జూలై 10, 2024 న రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్దం చేసింది. అనుగుణంగా తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వలను కలిపేలా వాటి మద్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తూ జీవో 49 ని జారీ చేసింది.
అయితే ఈ జోవో పట్ల స్థానిక ప్రజలు అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలతో సంక్షేమ భవన్ లో జూన్ 10, 2025 సమావేశమై జీవో 49 ను నిలిపి వేయాలని తీర్మాణం చేశారు. సీఎంను ప్రత్యేకంగా కలిసి స్థానిక ప్రజల ఆకాంక్షలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క అటవి అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో 3 జూలై 2025 న సమావేశమై మరో సారి చర్చించి జీవో 49 ని నిలుపు దల చేయాలని నిర్ణయించారు. అనుగుణంగా సీఎం దృష్టికి తీసుకెల్లి జీవో ను నిలిపుదల చేసేలా ఒప్పించారు. దీంతో జీవో 49 ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు మోమోను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు సంబురాలు చేసుకుంటున్న నేపథ్యంలో..వారి ఆకాంక్షల మేరకే జీవో 49 పై ముందుకు వెళుతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.