KhammamPoliticalTelangana

రైతు బంధు సమన్వయ కర్త మండల అధ్యక్షుల రేసులో పొన్నం కృష్ణయ్య..?

రైతు బంధు సమన్వయ కర్త మండల అధ్యక్షుల రేసులో పొన్నం కృష్ణయ్య..?

రైతు బంధు సమన్వయ కర్త మండల అధ్యక్షుల రేసులో పొన్నం కృష్ణయ్య..?

డాక్టర్ మట్టా దయానంద్ ప్రధాన అనుచరుడుగా గుర్తింపు..

జనవరి 19, తల్లాడ సికె న్యూస్ ప్రతినిధి విజయ్

*రైతుబంధు సమన్వయకర్త తల్లాడ మండల అధ్యక్షుల రేసులో మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం కృష్ణయ్య ముందున్నారు. ఆయన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయిదయానంద్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామం ఓట్ల పరంగా, జనాభాపరంగా పెద్దది కావడంతో ఈ పదవి ఆ గ్రామానికి దక్కే అవకాశం మెండుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంజిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానందుకు అనుచరుడుగా రేయింబవల్లు ఎమ్మెల్యే మట్టా రాగమయి గెలుపు కోసం పనిచేశారు.

బలమైన కమ్మ సామాజిక వర్గం కావడంతో పాటు రైతుబిడ్డగా పొన్నం కృష్ణయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా గతంలో సిపిఎం పార్టీలో ఉన్న సమయంలో ఆయన అనేక పదవులను పనిచేసిన అనుభవం ఉంది. మండలంలోని అన్ని గ్రామాల నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తల్లాడ మండల రైతు బంధు అధ్యక్షులుగా ఆయనకే దక్కే అవకాశాలున్నట్లు మండలంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా మట్టా దయానందుకు ప్రధాన అనుచరుడుగా ఉండటంతో ఆ పదవి ఆయనను వరించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని నేతలకు కబురు పంపడంతో పొన్నం కృష్ణయ్య ఆ పదవిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ దయానంద్ కు అనుచరులుగా ఉన్న ప్రతిఒక్కరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నామినేటెడ్ పదవులు ఆయన అనుచరులకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button