
రూ.2 లక్షల లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ GHMC డిప్యూటీ కమిషనర్
Web desc : రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ GHMC డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏసీబీ అధికారులు చాలా యాక్టీవ్‌గా పనిచేస్తున్నారు.
అవినీతి తిమింగలాలను ఏరిపారేస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆయన్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడటం హాట్ టాపిక్‌గా మారింది.