
కేటీఆర్‌కు ఎంపీ సీఎం రమేష్ వార్నింగ్
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై బీఆర్‌ఎస్ భయపడుతోందని ఆయన ఆరోపించారు.
“కేటీఆర్ భాష, ప్రవర్తన చూసుకో!”
సీఎం రమేష్ మాట్లాడుతూ, “తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్‌ఎస్‌కు పుట్టగతులు ఉండవని వాళ్ళు (బీఆర్‌ఎస్) భయపడుతున్నారు. అందుకే కేటీఆర్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌ను ఉద్దేశించి “నువ్వు మాట్లాడే భాష, బిహేవియర్ ఎలా ఉందో చూసుకో” అంటూ సీఎం రమేష్ హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, కేటీఆర్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన పరోక్షంగా అన్నారు.
“అసత్య ఆరోపణలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి”
తెలంగాణ ప్రభుత్వం లోన్లు తెచ్చుకోవడంపై తనను అక్రమంగా విమర్శిస్తున్నారని సీఎం రమేష్ మండిపడ్డారు.
“తెలంగాణ ప్రభుత్వం లోన్ తెచ్చుకుంటే నాకేం సంబంధం? దీనిపై నాకు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, అసత్య ఆరోపణలు చేసినందుకు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.