
టీసీ ఇప్పించండి లేదా సమస్య పరిష్కరించండి.. ఎమ్మెల్యేకు గిరిజన మహిళా విద్యార్థుల ఫిర్యాదు
అశ్వారావుపేట టౌన్: సార్… కాలేజీలో ఉండలేకపోతున్నాం. అన్నం సరిగా పెట్టడం లేదు.. రోజూ ఒకే రకంగా కూరగాయలతో వంట చేస్తున్నారు. ఏడాది అవుతున్నా కొత్త మెనూ అమలు చేయటం లేదు.
ఇంత ఓపిక పట్టాం.. ఇక ఉండలేము. అంటూ గిరిజన విద్యార్థినీలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు పిర్యాదు చేశారు. మా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వివరాల్లోకి వెళితే….
మండలంలోని పెదవాగు ప్రాజెక్టు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినీలు సమస్యలతో కూడిన లేఖను ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు జూలై 27వ తేదీన పంపించారు,
కాలేజిలో ఏడాది దాడిపోతున్నా కొత్త మెనూ అమలు చేయటం లేదని, ఫుడ్ కూడా సరిగా పెట్టడం లేదంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రకమైన కూరగాయల కూర పెడుతున్నారు.పిర్యాదు చేస్తే
టెండర్లో సమస్య ఉందని సమాచారం ఇస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా బాష్ రూమ్స్ కు డోర్లు, లైట్లు లేవని, గడ్డి విపరీతంగా పెరిగిపోవటంతో పాములు సంచరిస్తున్నాయని, రాత్రి సమయంలో వాష్ రూమ్ కి వెళ్ళేందుకు భయమేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ కి సమస్యలు చెప్పినా పటించుకోవటం లేదని, అందుబాటులో కూడా ఉండటం లేదంటూ పేర్కోన్నారు.
ప్రిన్సిపల్ కు సమస్యలు చెప్పినా పట్టించుకోవటం లేదని, అందుబాటులో కూడా ఉండటం లేదంటూ పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ రెండు లేదా మూడు రోజులు వస్తున్నారని, అదికూడా మద్యాహ్న సమయంలో వచ్చి సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతున్నారని తెలిపారు. ఇన్ని రోజులూ ఓపిక పట్టాం కాని సమస్యలతో ఉండలేకపోతున్నాము.
కనీస సౌకర్యాలు లేక చదువుకోలేకపోతున్నాం, ఎక్కువ మంది విద్యార్థినీలు టీసీలు తీసుకుని వేరే కళాశాలలో చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
చదువుకోవాలని ఉన్నా సమస్యను ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళతామని చెపుతున్నట్లు లేఖలో పేర్కోన్నారు. మా సమస్యలు పరిష్కరించేలా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనితో పాటు కొందరు తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేకు కళాశాల సమస్యలపై ప్రత్యేక లేఖ రాశారు.
జూలై 27వ తేదీన పిల్లల కోసం కళాశాలకు వస్తే కనీస సదుపాయాలు లేక ఉండలేకపోతున్నట్లు ఏడుస్తున్నారని, ముఖ్యంగా గడ్డీ బాగా ,పెరిగిపోవటం వల్ల పాములు సంచరిస్తున్నాయని, మేము నేరుగా పాములు చూసాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
భోజనంలో నాణ్యత లేదని, సమస్యలు చెప్పినా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు.