
స్పోర్ట్స్ కాంక్లేవ్ సూపర్ హిట్
సికే న్యూస్ ప్రతినిధి హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సమన్వయంతో
శనివారం నాడు హెచ్ఐసీసీ నోవా టెల్ లో స్పోర్ట్స్ కాంప్లెవ్ పేరిట నిర్వహించిన సదస్సు విజయవంతం అయింది.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన క్రీడా విధానం 2025 ను అధికారికంగా విడుదల చేసి జాతీయస్థాయిలో విస్తృతంగా పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లెజెండరీ క్రీడాకారులు అభినవ్ బింద్ర అనిల్ కుంబ్లె,పుల్లెల గోపీచంద్ గగన్ నారంగ్ అంజు జార్జి ప్రఖ్యాత క్రీడా విశ్లేషకులు చారు శర్మ తోపాటు వరల్డ్ అథ్లెటిక్స్ కమిటీ వైస్ చైర్మన్ అదిల్లె సుమారివాలా, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు కళ్యాణ్ చౌబె, తోపాటు ఫలువు పలువురు ఫెడరేషన్ ప్రతినిధులు మాజీ ఒలంపియన్లు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తెలంగాణ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ ప్రతినిధులు మొత్తంగా యావత్ క్రీడా సమాజం ఈ సమావేశానికి హాజరు కావడం క్రీడారంగా నిష్ణాత్తులు, క్రీడా జర్నలిస్టులు పానల్ డిస్కషన్స్ లో తమ అభిప్రాయాలు తెలియజేయడం తో స్పోర్ట్స్ కాంక్లేవ్ సూపర్ సక్సెస్ అయ్యింది.
సీఎం రేవంత్ చొరవతో
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యకు క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తామని పలు సందర్భాల్లో చెప్పినట్లుగా క్రీడల శాఖ బడ్జెట్ను పెంచడం వివిధ క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం తెలంగాణ క్రీడా విధానము పటిష్టంగా రూపొందించి అమలు పరుస్తామని ప్రకటించడం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా క్రీడల కోసం ఇవ్వని సమయాన్ని ఇస్తూ పలు క్రీడా కార్యక్రమాలు ఆయన స్వయంగా పాల్గొనడం తో స్తబ్దుగా ఉన్న క్రీడారంగం ఒక్కసారిగా క్రియాశీలం అయిపోయింది.
క్రీడా విధానం రూపకల్పనపై అనేకసార్లు ఆయన సమీక్షలు చేసి తన ఆలోచనలు అధికారులతో పంచుకున్నారు.
ఎంతో శ్రద్ధతో ఆసక్తితో రూపొందించిన క్రీడా విధానం పకడ్బందీగా అమలు చేయాలన్న సీఎం రేవంత్ ఆలోచన మేరకు రూపొందించబడిన ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో పాల్గొనడానికి ఆయన ఢిల్లీలో జరిగిన న్యాయవిభాగం సదస్సు కార్యక్రమాన్ని ముగించుకొని వెంటనే హైదరాబాద్ కు బయలుదేరి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
క్రీడా విధానాన్ని కాగితాలకే పరిమితం చేయకుండా దాన్ని అమలులో అధికారులను కచ్చితంగా శుద్ధి చూపించాలని గతంలో ఆయన ప్రకటించారు.
ఇటీవల క్యాబినెట్ నూతన క్రీడా విధానం 2025 ను ఆమోదించడం అందుకు అనుగుణంగా వివిధ వ్యక్తులను క్రీడా సంస్థలను అమలులో భాగం చేస్తూ పలు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని
ఆయన ఇచ్చిన ఆదేశం ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
గత 15 రోజులుగా అధికారులు జాతీయస్థాయిలో ఉన్న ప్రముఖ క్రీడాకారులతో ఫెడరేషన్ ప్రతినిధులతో వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించి అర్థవంతంగా స్పోర్ట్స్ కాంక్లేవ్ నిర్వహించడములో సక్సెస్ సాధించారు.
వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎం ఓ యూ లు క్రీడారంగంలో మార్పులు తీసుకువస్తాయని క్రీడా సమాజం ఆశిస్తుంది. క్రీడాభివృద్ధిలో పలువురిని భాగస్వామ్యం చేయడం పట్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడల అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ
స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కోసం 14 మంది క్రీడా ప్రముఖులతో పాలకమండలిని ప్రకటించడం, తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ( టీఎస్ డిఎఫ్ ) ను ఏర్పాటు చేయడం, జిల్లాలలో క్రీడల అభివృద్ధి కొరకు కలెక్టర్ వద్ద అందుబాటులో ఉండే క్రూషియల్ ఫండ్స్ నుంచి 10శాతం నిధులు క్రీడల అభివృద్ధికి కేటాయించడం వినూత్నమైన ఆలోచనలు గా క్రీడా వర్గాల నుండి హర్షం వ్యక్తం అవుతోంది
మరిన్ని సదస్సులు
స్పోర్ట్స్ కాంక్లేవ్ సూపర్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో మరిన్ని సదస్సులు నిర్వహించాలని, రాష్ట్రంలో ఉన్న క్రీడారంగ మేధావులతో వివిధ సంస్థల ప్రతినిధులతో ఇటువంటి చర్చ గోష్టులు నిర్వహించాలని కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా వివిధ జిల్లా కేంద్రాల్లో కూడా వివిధ సంస్థల సహకారంతో ఇటువంటి సదస్సులు నిర్వహించే ఆలోచనలు అధికారులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని
నాలుగైదు రోజుల ముందు నుండే ఇటువంటి కార్యక్రమాలు
నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.
దీని విషయంలో అధికారులతో చర్చించి కార్యక్రమాలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.
ప్రకటించిన క్రీడా విధానం కాగితాలకే పరిమితం కాకుండా ఒలంపిక్స్ పతకాలే లక్ష్యంగా క్రీడా శాఖ పని చేయాలన్న సీఎం రేవంత్ ఆలోచనల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేయబోతుందని దీనితో స్పోర్ట్స్ అథారిటీ బాధ్యతలు మరింత పెరిగాయని ఆయన అన్నారు.