
బంగారం చోరీ కేసులో మహిళా అరెస్ట్..
దొంగలించబడిన సొత్తు స్వాధీనం.
రిమాండ్ నిమిత్తం ఖమ్మం జిల్లా కోర్టులో హాజరపరిచిన ఎస్సై కూచిపూడి జగదీష్.
సి కె న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు, తిరుమలాయపాలెం,ఆగష్టు 6
చోరీ కేసులో ఓ మహిళలను బుధవారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపిన వివరాలివీ..మే 23న తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని పగిళ్ల రామకృష్ణ ఇంట్లో
బంగారం, వెండి వస్తువులు ( బంగారపు నెక్లెస్ -1, ఉంగరాలు -2, చెవిదిద్దులు -2, మాటీలు -2, ఒక జత వెండి పట్టీలు, వెండి మొలత్రాడు -1) సుమారుగా లక్ష రూపాయల విలువ గల బంగారు, వెండి వస్తువులు దొంగిలించబడినవి.దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎంక్వయిరీ లో భాగంగా డోర్నకల్ మండలానికి చెందిన మహిళను పట్టుకొని విచారించగా, తనే చోరీ చేసినట్లు ఒప్పుకున్నది. దొంగిలించబడిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఖమ్మం జిల్లా కోర్టులో హాజరపరిచారు.