
ఎక్స్పైరీ డేట్ ముగిసిన వస్తువులు విక్రయం
సికె న్యూస్ ప్రతినిధి కూసుమంచి ఆగస్టు 10 న్యూస్
కూసుమంచి మండల కేంద్రంలో గడువు ముగిసిన వస్తువులు విక్రయానికి ఉంచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం ఓ యువకుడు ఎస్ మార్ట్ దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వాటర్ బోటిల్ గడువు తేదీ 25.10.24 ఉంది. అయితే ప్రస్తుత తేదీ 23.04.25 కావడంతో అది గడువు మించిన ఉత్పత్తిగా తేలింది.
తక్కువ ధర ఉన్న బిస్కెట్లు, స్నాక్స్,కూల్ డ్రింక్స్, గోధుమ రవ్వ, లాంటి పదార్థాల్లో గడువు తేదీని చాలామంది పట్టించుకోకుండా పోతుండడంతో కొంతమంది దుకాణా దారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే తరహాలో గత కొంతకాలంగా ఎక్స్పైరీ అయిన కిరాణా వస్తువులు విక్రయమవుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వినియోగదారుల్లో అసంతృప్తి నెలకొంది.
*చట్టపరంగా నేరం…*
ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించడం ఎఫ్. ఎస్ ఎస్ ఏ ఐ చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరం. దీని ప్రకారం బాధ్యులపై జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ప్రజల ఆరోగ్యాన్ని హాని చేసే ఇటువంటి విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కూసుమంచిలో ఎక్స్పైరీ అయిన వస్తువులు అమ్ముతున్నారు
వడ్తియా వెంకటేష్
కూసుమంచి మండల కేంద్రంలో నాకు దాహం వేసి వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు ఎస్ మార్ట్ వద్దకు వచ్చాను. అక్కడ వాటర్ బాటిల్ కొనుగోలు చేయగా వాటర్ బాటిల్ గడువు ముగిసి సుమారు నాలుగు నెలలు కావస్తున్నా, ఆ వాటర్ బాటిల్ లను విక్రయిస్తున్నారు.
కూసుమంచి మండలంలో కేవలం వాటర్ బాటిళ్లు మాత్రమే కాదు, గడువు ముగిసిన కిరాణా సామానులు, ఇతర వస్తువులు అమ్ముతున్నారని ప్రజారోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగదారుడు కూసుమంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ మార్ట్ దుకాణంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు