
ఖమ్మం పోలీసులపై తాతా మధు ఫైర్.. ముగ్గురు మంత్రులు ఉన్నా ఇంతేనా అంటూ..!
ఖమ్మం జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదనరావు సంచలనం కామెంట్ చేశారు.
బుధవారం ఖమ్మం నగరంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు… గత వారం రోజులుగా ఖమ్మం నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్న పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందని ఆయన ఆరోపించారు.
గొల్లగూడెం ప్రాంతంలో దొంగలు మరణ ఆయుధాలతో తిరుగుతున్న దృశ్యాలు ప్రతి సెల్ ఫోన్ లో ఉన్నాయని, కానీ ఇప్పటివరకు పోలీస్ యంత్రాంగం వారిని గుర్తించకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న శాంతి భద్రతలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తి అనేక ప్రజా పోరాటాలకు నిలబడిన ఖమ్మం జిల్లా, ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు భయంతో జీవించే పరిస్థితి లేదని, అర్థం కాని భార్యాభర్తలు స్వేచ్ఛగా బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
సత్తుపల్లి, ఖమ్మం లో దొంగల దొంగతనాలు చేసిన ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా లేదని స్పష్టం చేశారు. ముగ్గురు మంత్రులకు ప్రోటోకాల్ కే సిబ్బంది సరిపోవడం లేదని, ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు.
ముగ్గురు మంత్రులు టైం టేబుల్ లేకుండా పర్యటనలు చేయడంతో ప్రభుత్వ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ఆదివారం రోజున కూడా జిల్లా మంత్రులు పర్యటన చేసే ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులకు సమయం ఎప్పుడు ఇస్తారు అంటూ మండిపడ్డారు. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ గా మారిన ఖమ్మం జిల్లాను ముగ్గురు మంత్రులు దృష్టి సారించి కట్టడి చేయాలని డిమాండ్.
ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మాక్బల్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, నాయకులు బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.