గురుకుల కళాశాల విద్యార్థినికి పాముకాటు
వైరా: వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని పాటు కాటు వేసింది. కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదు వుతున్న కె.ప్రసన్న సోమవారం రాత్రి డైనింగ్ హాల్ లో భోజనం చేశాక తరగతుల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యలో పాటు కాటుకు గురైంది. దీంతో తోటి విద్యార్థినులు ఇచ్చిన సమాచారంతో ఉద్యోగులు ఆమెను వైరా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడ గా ఉందని ఉద్యోగులు తెలిపారు. అయితే, విద్యా ర్దిని పాటుకాటుకు గురైన సమయాన ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ రామలక్ష్మి ఆమెను తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ఆరా తీసిన కలెక్టర్
ఖమ్మం మయూరి సెంటర్: పాము కాటుకు గురైన వైరా గురుకులం విద్యార్థిని ప్రసన్నను ఖమ్మం
ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా పీడీఎస్ఈయూ నాయకులు పరామర్శించారు. అయితే, విషయాన్ని అప్పటివరకు గురుకులం బాధ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లలేదని తెలియడంతో నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలు ఆరా తీసిన ఆయన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు