
నేషనల్ ర్యాంకర్ ను సన్మానించిన సామాజిక సేవా కార్యకర్త
పలమనేరు, ఆగస్టు 16, సి కె న్యూస్ పలమనేరు పట్టణానికి చెందిన, భాగీరధి లక్ష్మీపతి కుమారుడు శశి శ్రీనివాస్ అటు సీఎంఏ, సీఏ లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విషయం తెలిసిందే.
చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉంటూ….పదవ తరగతి నుండి, ఏడుసార్లు జాతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థి ప్రతిభను గుర్తించి….
పలమనేర్ సామాజిక సేవా కార్యకర్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేషనల్ సెక్రెటరీ మధు మోహన్ రావు, ఆ అబ్బాయిని స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మధుమోహన్రావు మాట్లాడుతూ…పలమనేరు ఖ్యాతిని జాతీయస్థాయిలో తీసుకువెళ్లి, మూడుసార్లు కలకత్తాలో, ఒకసారి చెన్నైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో రాష్ట్రపతి వద్ద అవార్డు తీసుకున్న ఇటువంటి విద్యార్థిని, మంచి ప్యాకేజీలో సెలెక్ట్ అయిన విద్యార్థిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని, చదువుతున్న విద్యార్థులందరూ…ఈ అబ్బాయిని రోల్ మోడల్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
సామాజిక సేవ చేస్తున్న నేను, ఇకపై, ఈ విధంగా ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను సన్మానిస్తానని, ఈ సందర్భంగా మధుమోహన్రావు తెలియజేశారు.