
ఉపాధి హామీ కార్యాలయంలో చెలరేగిన మంటలు.. ఆ ఫైల్స్ దగ్ధం
ఏన్కూర్ మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి కార్యాలయంలోని ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫైల్స్ మొత్తం దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ కార్యాలయంలో, రెండు శాఖలు కార్యాలయం విధులు నిర్వహిస్తున్నారు. ఇందిరా క్రాంతి పథకం, ఉపాధి హామీ కార్యాలయం కార్యకలాపాలు ఈ భవనంలో నిర్వహించడం జరుగుతుంది.
శనివారం మధ్యాహ్నం కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించడం జరిగింది.
స్థానికులు యువకులు నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా మరి ఏమైనా కారణాలు ఉన్నాయనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది.