
రెడ్ అలర్ట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
శనివారం సాయంత్రం మరియు రాత్రి భారీ వర్షం పడే అవకాశం.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఆగస్టు 16,
వాతావరణ శాఖ తెలిపినట్లుగా, శనివారం (16.08.2025) సాయంత్రం మరియు రాత్రి సమయం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతానికి పెద్ద వర్షపాతం లేనప్పటికీ, రాత్రికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, తెలిపారు.
దీని నేపథ్యంలో జిల్లా రెడ్ అలర్ట్ లో ఉందని కలెక్టర్ పేర్కొని, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వెంటనే గ్రామాలు, రైతులు, స్థానిక సిబ్బంది మరియు ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు.
రైతులు ముఖ్యంగా సాయంత్రం తర్వాత వాగులు, పొలాలకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ, ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రమాదాల సందర్భంలో లేదా సహాయం కావాలనిపించినప్పుడు, ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములను సంప్రదించవచ్చునని తెలిపారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు:
కలెక్టర్ ఆఫీస్, భద్రాద్రి కొత్తగూడెం ( పాల్వంచ),
08744-241950
93929 19743 (వాట్సప్)
సబ్ కలెక్టర్ ఆఫీస్, భద్రాచలం
08743-232444
93479 10737 (వాట్సప్)
ఐ టి డీ ఏ, భద్రాచలం
79952 68352
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు పై నంబర్లకు సమాచారం ఇవ్వగలరని జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం, కోరారు.