
ఆసుపత్రిలో ఖైదీ రాసలీలలు.. వీడియో వైరల్
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జీవిత ఖైదు అనుభవస్తున్న వ్యక్తితో ఓ మహిళ సరసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆసుపత్రిలో ఖైదీతో ఉన్న అరుణ అనే మహిళ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారంటూ ఆరోపణలు వచ్చాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలతో ఖైదీని బయటకు రప్పించింది అన్న ఆరోపణలు సంచలనంగా మారాయి..
ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో అతను ఖైదీగా ఉన్నాడు.
2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్.. 2018 నవంబరులో మళ్లీ పోలీసులకు చిక్కి అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు.అయితే.. పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు.
శ్రీకాంత్ బయటకొస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవ కాశముందని.. అతనికి పెరోల్ ఇవ్వొద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, నెల్లూరు జైల్ సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపారు.
వాటిని బేఖాతరు చేస్తూ అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ కొద్ది రోజుల కిందట హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్‌ను తానే నడిపిస్తూ దందాలు చేయిస్తున్న సదరు మహిళే.. నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఈ పెరోల్ మంజూరు చేయించారని చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఖైదీని ఎవరూ కలవకుండా పోలీసులు చూసుకుంటారు.
కానీ అరుణ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్పత్రిలో ఉన్న ఖైదీ శ్రీకాంత్ దగ్గరకు వెళ్లేవారు. ఆస్పత్రిలో ఖైదీ శ్రీకాంత్ ఆమెతో సరసాలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం వివాదంగా మారింది.