
ఘనంగా ఫోటోగ్రఫీ డే
పలమనేరు ఆగస్టు 19 సీకే న్యూస్
పలమనేరు:పట్టణం క్లాక్ టవర్ వద్ద మంగళవారం ఫోటోగ్రఫీ డే ని ఘనంగా సెలబ్రేట్ చేశారు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు.
ఫోటో కెమెరా సృష్టికర్త “లూయిస్ డాగురె” చిత్రపటానికి పూలమాలలువేసి పూజలు చేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు, అనంతరం డాగురె అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ పెద్దలను గౌరవంగా సత్కరించుకున్నారు.
లూయిస్ డాగురె అనే వ్యక్తి లేకుండా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఫోటో వృత్తి అనేది లేకుండా ఎన్నో లక్షల మందికి జీవనోపాధి ఉండేకాదని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు.