
ఎస్సారెస్పీ కాలవలు కనుమరుగు..
కొన్నిచోట్ల ఆక్రమణలు..మరికొన్నిచోట్ల పూడ్చివేతలు..
కాకరవాయి,ముజాహిద్ పురం,సోలిపురం రెవిన్యూ లో ఎస్సారెస్పీ కాలువ పూడ్చివేతలు.
నిర్వహణను గాలికొదిలిన ఇరిగేషన్ అధికారులు.
చివరి ఆయకట్టుకు అందని నీరు..
సీకే న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు,తిరుమలాయపాలెం న్యూస్.
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, సోలిపురం, ముజాహిద్ పురం గ్రామంల రెవెన్యూ పరిధిలో ఎస్సారెస్పీ పిల్ల కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదు..
కొన్ని యదేచ్చగా ఆక్రమించగ.. మరికొన్ని మట్టితో పుడుకుపోయాయి.. ఇరిగేషన్ అధికారులు నిర్వహణ గాలికి వదిలేయడంతో.. నీటి సరఫరానే లేకుండా ఎస్సారెస్పీ పిల్ల కాలువలు పూడ్చివేతకు గురవుతున్నాయి..
మరిపెడ బంగ్లాలోని (21ఆర్ ఆఫ్ 3 ఆర్ )కెనాల్ కాలవ ద్వారా ఎస్సారెస్పీ నీళ్ళు అందుతుండగా.. ఆ కెనాల్ కు సంబంధించిన కాకరవాయి, ముజాహిద్ పురం, సోలిపురం గ్రామంలోని పిల్ల కాలువలన్ని మూసుకుపోయాయి..
ఓవైపు భూములకు రేట్లు పెరగడంతో కొందరు రైతులు కాలువలను ఆక్రమించుకోగా.. మరికొన్నిచోట్ల కాలవల్లో చెట్లు పెరిగి పూడ్చివేతకు గురయ్యాయి..
పట్టించుకోని ఆఫీసర్లు..
ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెలో అప్పట్లో ఎస్సారెస్పీ పిల్ల కాలువలు నిర్మించారు. కాకరవాయి గ్రామం నుంచి ముజాహిద్ పురం, సోలిపురం గ్రామాల నుంచి రెండు పిల్ల కాలువలు విస్తరించి ఉన్నాయి..
ప్రస్తుతం ఆ కాలవలు కబ్జాకు గురికావడం, మట్టితో పుడుకపోవడంతో ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా పోయాయి.. దీంతో ఆ కాలువలకు నీరు విడుదల అనేది లేకుండా పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది.. ఆఫీసర్లకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడంలేదని ఆరోపణలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి..
యదేచ్ఛగా కబ్జా..
వ్యవసాయ భూముల నుంచి వెళ్లిన ఎస్సారెస్పీ పిల్ల కాలువలకు నిధులు రైతుల ఎకౌంట్లోకి విడుదల చేసినప్పటికీ కొందరు యదేచ్చగా కబ్జా చేస్తున్నారు..
కాకరవాయి, సోలిపురం తదితర ప్రాంతాలలో భూముల రేటు పెరగడంతో కాలువలు ధ్వంసం చేసి చదును చేస్తున్నారు.. ఏనెకుంట తండా, కాకరవాయి చౌడమ్మ దేవాలయం ప్రక్కనుంచి ఎస్సారెస్పీ కాలువ విస్తరించి ఉండగా ప్రస్తుతం కొన్నిచోట్ల కనుమరుగయ్యింది.
కాకరవాయి,ముజాహిద్ పురం ఎస్సారెస్పీ బాధ్యతలు మరిపెడ ఇరిగేషన్ అధికారులకు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి, ముజాహిద్ పురం, సోలిపురం రెవిన్యూ పరిధిలోని ఎస్సారెస్పీ కాలవల బాధ్యతలు వరంగల్ ఇరిగేషన్ అధికారులకు అప్పగించినప్పటికీ వారు పూర్తిస్థాయిలో కాలువలను పూర్తి చేయకపోవడం,
ఇటు ఖమ్మం ఇరిగేషన్ అధికారులతో వారి సమన్వయ లోపమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లనే ఈ ప్రాంత ప్రజల పంట పొలాలకు నీరు అందట్లేదనే అపవాదు వరంగల్ ఇరిగేషన్ అధికారులపై వినిపిస్తుంది..
ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టాం త్వరలోనే పూర్తి చేస్తాం..మరిపెడ ఇరిగేషన్ డి ఈ సంజీవ్.
కొందరు రైతులకు నిధులు విడుదల కాకపోవడమే ఎస్సారెస్పీ కాల్వపనులు నిలచిపోయాయి.. ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టాం త్వరలోనే కాల్వ పనులు పూర్తి చేస్తాం.. కాలువలు తీసినంత మేరకు నిధులు విడుదలయ్యాయి..
ఎస్సారెస్పీ కాలవలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం..ముఖ్యంగా కాలవలను పూడ్చివేస్తే తిరుమలాయపాలెం మండలం ఇరిగేషన్ శాఖ సిబ్బంది తనిఖీ చేయించి చర్యలు తీసుకోవాలి.