
నాపై కక్ష గట్టారు… ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఎంఎల్‌సి కవిత విమర్శలు గుప్పించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని మండిపడ్డారు.
సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఎంఎల్‌సి కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్ ఎన్నిక. కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు” అంటూ కవిత మండిపడ్డారు.
గతంలో కేసీఆర్‌కు రాసిన లేఖలు లీక్ చేసి కుట్రలు చేశారు. పార్టీ వ్యవహారాలను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధిస్తున్నారు” అంటూ కవిత చెప్పుకొచ్చారు.
కాగా, కవితకు బీఆర్ఎస్ హైకమాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. గురువారం ఉదయం సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు.




