
ఏసీబీ వలలో వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుష్మా చౌరస్తా వద్ద ఉన్న వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్ రాజేశ్ కుమార్ సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధిలో గల 200 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో బాధితుడి వద్ద సబ్ రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేశాడు.
ఆయన డిమాండ్ మేరకు బాధితుడు రూ.70వేలు చెల్లించేందుకు అంగీకరించాడు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దనే అర్జున్‌రావు డాక్యుమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న నాగోల్‌కు చెందిన రమేశ్ గౌడ్ సహాయంతో బాధితుడు, సబ్‌రిజిస్ట్రార్‌కు రూ.70వేలు చెల్లించాడు.
రమేశ్‌గౌడ్, సబ్‌రిజిస్ట్రార్‌కు నగదును అందజేస్తున్న క్రమంలో సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.