
ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన టీచర్
రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో 10 మంది విద్యార్థినులకు అస్వస్థతగా ఉందని తెలిపారు. అయితే గతంలో ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
అలాగే ఇప్పుడు కూడా మళ్లీ అదే స్కూళ్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది.
పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి విద్యార్ధులకు అస్వస్థత.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరిశాల కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో 10 మంది విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనలో నిన్న రాత్రి భోజనం తర్వాత ఆరుగురు, ఈరోజు ఉదయం నలుగురు విద్యార్థులకు అస్వస్థతగా మారింది. అయితే ఈ విషయం ఎవరికి తెలియకుండా.. విద్యార్థులను ఎవరు కలవకుండా.. స్కూల్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు..
ప్రిన్సిపల్ మీద కోపంతో ట్యాంక్‌లో పురుగుల మందు..
అయితే ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అదే స్కూ్ల్లో చేస్తున్న సైన్స్ టీచర్ ప్రిన్సిపల్ మీద కోపంతో ఏకంగా వాటర్ ట్యాంక్‌లోనే పురుగుల మందు కలిపాడు.
ఈ విషయం తెలయని పాపం చిన్నారులు నిన్న పురుగుల మందు కలిపిన నీళ్ల తాగి పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం వారందరికి చికిత్స జరుగుతుంది.
టీచర్ రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత టీచర్ రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి.
అయితే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయించాలని కుట్రతోనే.. సైన్స్ టీచర్ రాజేందర్ వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపాడని తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికి టీచర్స్ మీద కోపం ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి.. కానీ, అలా పురుగుల మందు మొత్తం వాటర్ ట్యాంక్‌లో కలిపితే చిన్నారులు తాగుతారు..
వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆ మాత్రం తెలియకుండా ఉండకపోవడం చాలా విషాదకరంగా ఉంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.