
తిరుమలాయపాలెం యువతి వైజాగ్ లో ఆత్మహత్య.
సీ కె న్యూస్, తిరుమలాయపాలెం.
తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన ఓ యువతి వైజాగ్ లో సూసైడ్ చేసుకుని మరణించింది.పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలు..
అదే గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడికి ఇదివరకే మ్యారేజ్ అయిందని,అయినప్పటికీ వారి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది.
రాఖీ పండుగ అనంతరం,హైదరాబాద్ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వైజాగ్ వెళ్లారు.అక్కడే టూటౌన్ ప్రాంతంలో రూమ్ తీసుకుని ఉంటున్నారు.
కాగా నరేశ్ ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లాడని, మనస్థాపానికి గురై ఆ యువతి, సూసైడ్ నోట్ రాసి శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
ఇది ఇలా ఉంటే నరేశ్ కనిపించడం లేదని గతంలో తల్లిదండ్రులు తిరుమలాయపాలెం పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు సైతం పెట్టినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు.