
సీక్రెట్ మీటింగ్ పై కోమటిరెడ్డి క్లారిటీ
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరో ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే పలుమార్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డి ఈటల రాజేందర్ ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్త కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఆయన నిజంగానే 25 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం జరిపి ఉంటారని అంతా అనుకుంటున్నారు.
కాగా ఈ సీక్రెట్ మీటింగ్ పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. ఆ ప్రచారం అబద్దం అని కొట్టి పారేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు క్లాషెస్ ఉన్నప్పటికీ పార్టీలో చీలిక తెచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.
ఎమ్మెల్యేలు తనను మాములుగా కలిశారని, దానిని మీటింగ్ అని పొరబడుతున్నారని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా.. సీఎంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ ఈ సీక్రెట్ మీటింగ్ వార్త రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది.