
కోళ్ల గూట్లో తాచు పాము బుసలు
సమయస్ఫూర్తితో చాకచక్యంగా పట్టుకున్న సంతోష్
ఇరుకు ప్రదేశాలే పాములకు నిలయాలు
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఆగస్ట్ 25,
కార్పొరేషన్ లోని న్యూ గొల్లగూడెంలో ఓ ఇంట్లో సోమవారం సాయంత్రం కోళ్ల గూట్లోకి తాచుపాము చేరి కలకలం సృష్టించింది.
కోళ్లు కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఓ పాము కోళ్ల గూట్లోకి దూరడం చూసి భయంతో వెంటనే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే వారిని అప్రమత్తం చేసిన సంతోష్ అక్కడకు చేరుకుని చాకచక్యంగా గూట్లో దూరిన ఐదు అడుగుల తాచు పామును పట్టి బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
ఈ సందర్భంగా ఇరుకు ప్రదేశాలు, రాళ్ల కుప్పలు, నిరుపయోగ సామానులే సర్పాలకు ఆవాసాలు కాబట్టి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది అలాగే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సర్పాల పట్ల అవగాహన కలిగి ఉండడం అవసరమని వివరించారు.




