Uncategorized

కేంద్రం అసమర్థతతోనే రాష్ట్రంలో యూరియా కష్టాలు

కేంద్రం అసమర్థతతోనే రాష్ట్రంలో యూరియా కష్టాలు

రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ

కేంద్రం అసమర్థతతో ఇతర దేశాల నుండి దిగుమతి యూరియాను తెప్పించి, రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో ఘోర వైఫల్యం- మంత్రి తుమ్మల

రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంత వరకైనా పోరాడుతాము – మంత్రి తుమ్మల

ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకొని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించడం జరిగింది – మంత్రి తుమ్మల

కేంద్రం కేటాయింపులు, సరఫరాలు, స్వదేశీ యూరియా, దిగుమతి యూరియా వివరాలు మరియు ప్రస్తుత పరిస్థితులపై…..

తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

ఇటీవల యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిందిస్తూ సాగుతున్న రైతుల ఆందోళనలు, చెప్పులు పెట్టీ క్యూ లైన్ లు ఉండటంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో వాస్తవాలు ఏమిటి? యూరియా కొరతకు కారణాలు ఏమిటి? వాస్తవాలు దాచి పెట్టే పెద్దలు ఎవ్వరు? రైతుల ముసుగులో ప్రేరేపిత ఉద్యమాలు చేసే పార్టీలు ఏవీ?

వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రైతన్నలకు వాస్తవాలు తెలియజేయాలని ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

వాస్తవాలు ఇలా… తెలంగాణ లో యూరియా కొరతకు రెండు ప్రధాన కారణాలు. మొదటిది మన రాష్ట్రానికి దిగుమతి ద్వారా కేటాయించిన యూరియా ప్రపంచ వ్యాప్తంగా జియో పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల వల్ల రెడ్ సీ లో నౌకాయనం నిలిచిపోయి రాష్ట్రానికి రాలేదు. ఆగస్టు వరకు మన రాష్ట్రానికి దిగుమతి ద్వారా 3.94 LMTల యూరియాను కేంద్రం కేటాయించింది.

ఇందులో CIL కంపెనీ ద్వారా2౦౦౦౦0! 5 30,000, 25 61,000, 5 5 60,000, 5 57,800, 5 28,800

IPL కంపెనీ ద్వారా 25 55 10,800, 50,000, 5 5 20,000, 5 13,050, 5 10,800

KRIBHCO ఓ ఇప్పటివరకు CIL కంపెనీ ద్వారా 2 55 7,858, 25 42,252, 5 5 23,809, 55 37,368, 23,131

IPL కంపెనీ ద్వారా 2 5 5,457, 0, 5 5 19,970, 5 8,338, 5 8,439

KRIBHCO కంపెనీ ద్వారా 5 5 1,317, 3 55 9,243 NFL కంపెనీ ద్వారా జూన్ లో 2,491, జులై లో 20,654 LMTs యూరియా సరఫరా అయింది.

మొత్తంగా దిగుమతి యూరియా 3.96 LMTs కేటాయించగా, ఇప్పటివరకు 2.10 LMTs సరఫరా

రెండో ప్రధాన కారణం దేశీయంగా యూరియా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గ స్థాయిలో జరగకపోవడం. కేంద్రం మన రాష్ట్రానికి దేశీయ యూరియాను ప్రధానంగా RFCL నుండి కేటాయించింది. RFCL నుండి ఆగస్టు వరకు 1,69,325 మెట్రిక్ టన్నులు కేటాయించారు. RFCL వారు 1,06,852 మాత్రమే సరఫరా చేశారు. దీంతో 62,473 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడింది. మన రాష్ట్రంలో ఉన్న RFCL నుండి మన రాష్ట్రానికి అత్యధికంగా కేటాయింపులు జరపాలని, కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా… RFCL ఉత్పత్తిలో కేవలం 40 శాతం మాత్రమే మన రాష్ట్రానికి కేటాయించింది.

అయితే మే నుండి ఈ నెల వరకు 78 రోజులు RFCL లో ఉత్పత్తి జరగలేదు. దీని వలన రాష్ట్రానికి రావాల్సిన యూరియా సమయానికి రాలేదు.

యూరియా దిగుమతులు లేకపోవడం, దేశీయంగా డిమాండ్ కు తగ్గట్టు యూరియా ఉత్పత్తి జరగకపోవడం, ఈ రెండు కారణాల వలన యూరియా కొరత మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉంది.

మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేశారు. ఇందులో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించి, ఇప్పటి వరకు 5.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 2.58 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవ్వలేదు. కేటాయించిన యూరియా మనకు అందకపోవడంతో డిమాండ్ కు తగ్గట్టు నిల్వలు లేక రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తాయి. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉంటే ఇక్కడ మాత్రం ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు బద్నాం చేసే రాజకీయాలు చేస్తున్నాయి.

వాస్తవాలు దాస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశీయంగా యూరియాకు ఉన్న డిమాండ్ మరియు ఉత్పత్తికి మధ్య గ్యాప్ ఉండటంతో.. చైనా, రష్యా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుంటాం. ఒక్క చైనా నుంచే 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ చైనా నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి కావల్సిన యూరియా నిలిచిపోవడం, దేశీయంగా డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేక దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. దేశంలో ఎక్కడాలేని యూరియా కొరత, మన రాష్ట్రంలోనే ఎలా ఉంటుంది అని బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిజెపి పాలిత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందనే విషయాన్నీ ఎందుకు దాస్తున్నారు? అక్కడి రైతాంగం కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు కదా.! కేవలం మన రాష్ట్రంలోనే ఉందని ఎందుకు రైతులను తప్పుదారిల
పట్టిస్తున్నారు? కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చిత్తశుద్ది పాటించి ఉంటే ఇతర రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఏర్పడింది. ఇలాంటి వాస్తవాలు అన్ని కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి బిజెపి నాయకులు ఎందుకు దాస్తున్నారు? ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన యూరియాను, కేంద్ర అసమర్థతతో దిగుమతి చేసుకోలేక, వారి అసమర్థతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజేపి నాయకులు వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయటం సమంజసమేనా ఆత్మ విమర్శ చేసుకోవాలి. రైతాంగానికి వాస్తవాలు ఎందుకు చెప్పరు? ఇంపోర్ట్ లేక యూరియా కొరత ఉందనే వాస్తవాలు తెలపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై అక్కసుతో ఇలాంటి విమర్శలు చేయటం రైతాంగంకు తెలియదు అనుకుంటున్నారా? యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై లెక్కలతో సహా రైతులకు ప్రభుత్వం తెలిపినందున మీ భాగోతం ఇప్పుడు బయట పడింది కదా.

రైతులు ముసుగులో బీ.ఆర్.ఎస్ ప్రేరేపిత ఆందోళనలు… యూరియా కొరతపై సొసైటీ

కార్యాలయాల వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టించడం, బర్త్ డే వేడుకలు పేరుతో యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చినట్లు స్కిట్ లు చేయడం, మహిళలను క్యూ లెన్స్ లో నిలబెట్టి సోషల్ మీడియాలో యూరియా కొరతపై అసత్యాలు ప్రచారం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసే దిగజారుడు రాజకీయంతో రైతాంగంకు ఏమైనా మేలు జరుగుతుందా? యూరియా అందక ఆందోళనలో ఉండే రైతన్నలను మీ నీచ రాజకీయంతో ఇంకా ఆందోళనకు గురి చేయడం ఎందుకు? మీ పాలనలో యూరియా కొరత లేదు క్యూ లైన్ లు లేవని గొప్పలు చెప్పే బీ.ఆర్.ఎస్ నేతలకు జియో పాలిటిక్స్ పై అవగాహన లేదా? మీ పాలన సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎర్ర సముద్రంలో నౌకాయనం నిలవడం లాంటి పరిస్థితులు లేవు కదా. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ పరిణామాలతో మారిన చైనా వైఖరి వల్ల మన దేశానికి చైనా నుంచి రావాల్సిన యూరియా అందక దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఉంటే, కేవలం తెలంగాణలోనే యూరియా కొరత ఉన్నట్లు బీ.ఆర్.ఎస్ దౌర్భాగ్య రాజకీయంపై రైతాంగం ఆలోచన చేయాల్సిన సందర్భం
వచ్చింది. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, దిగుమతి చేసుకోవడంలో నెలకొన్న జియో పాలిటిక్స్ పై బీ.ఆర్.ఎస్ మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తే రైతాంగం మిమ్మల్ని మెచ్చుకుంటారు అనే మీ పగటి కలలు, భ్రమలుగానే మిగులుతాయి. మీ పాలనతో విసుగు చెందే రైతాంగం కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీతో రైతు భరోసాతో రైతు రాజ్యం సాగుతుంటే అక్కసుతో రాజకీయ స్వార్థంతో బీ. ఆర్ ఎస్ రైతుల ముసుగులో చేస్తున్న ప్రేరేపిత ఉద్యమాలపై రైతాంగం అప్రమత్తంగా ఉండాలి.

ప్రత్యామ్నాయాలు ఇలా..

యూరియా కొరత లేకుండా ఉండాలంటే.. దేశీయంగా యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ప్రత్యామ్నాయంగా పర్యావరణహితంగా ఉండే నానో యూరియాను వియోగించేవిధంగా ప్రోత్సహించాలి. నానో యూరియా వల్ల భూసారం దెబ్బతినదు, తక్కువ ఖర్చుతో రైతులకి మేలు జరుగుతుంది.

ఇంపోర్ట్ యూరియా ఇబ్బందులు తలెత్తడం, దేశీయంగా యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేక, డిమాండుకు సరఫరాకు మధ్య గ్యాప్ వల్ల రైతాంగంలో ఆందోళన తలెత్తకుండా ఉండాలంటే, యూరియా వాడకాన్ని తగ్గించాలంటే మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి. యూరియా బస్తా రెండు వందల యాభై రూపాయలకే అందుబాటులో ఉండటం, మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పదిహేను వందల రూపాయలకు పైగా ఉండటంతో సన్నకారు రైతులకు యూరియా వాడకం మాత్రమే దిక్కుగా మారింది. దేశ వ్యాప్తంగా డెబ్బై శాతం సన్నకారు రైతులు సాగుకోసం యూరియా వినియోగిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నా

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు

దిగుమతి యూరియాలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి స్వదేశీ యూరియానే కేటాయించాలని ఎన్నోసార్లు కోరింది. అయినప్పటికి రాష్ట్రానికి దిగుమతి యూరియాను ఎప్రిల్ నుండి ఆగస్టు వరకు 3.96 LMTs కేటాయించింది. దీంట్లో ఇప్పటివరకు కేవలం 2.10 LMTs సరఫరా అయి, 1.86 LMTs సరఫరా కావాల్సి ఉంది. రాష్ట్రానికి ఇప్పటివరకు ఏర్పడిన 2.58 LMTs యూరియా లోటులో ప్రధానంగా దిగుమతి యూరియా వలన ఏర్పడినదే.

అలాగే స్వదేశీ యూరియాలో ప్రధానంగా RFCL నుండి 1.69 LMTs కేటాయించింది. కాని ఎప్రిల్ నుండి ఆగస్టు వరకు RFCL లో 78 రోజులు యూరియా ఉత్పత్తి జరగలేదు. దీంతో కేవలం 1.07 LMTs మాత్రమే సరఫరా జరిగింది. దీంతో 64 వేల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడింది.

రాష్ట్రంలో మొత్తం లోటు 2.58 లక్షల మెట్రిక్ టన్నులు కాగా… ఇందులో పై రెండింటి వల్లే దాదాపు 2.49 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా లోటు ఏర్పడింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి 7 సార్లు లేఖ రాశాను. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగారు లేఖలతో పాటు కేంద్ర రసాయనాల మంత్రిని కూడా కలిసి లెక్కలతో సహా రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై చర్చించి, యూరియాను తొందరగా సరఫరా చేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా మా అధికారులు, ఎప్పటికప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రానికి రావాల్సిన యూరియా మీద పనిచేస్తున్నారు.

రాష్ట్ర రైతాంగం శ్రేయస్సు కోసం మా ప్రజా ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్ర రసాయనాల శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అలాగే రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిని, సహాయ మంత్రిని కూడా ఈ విషయాలన్ని వారి దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్రానికి రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించే ప్రయత్నం చేయాలని కోరాను. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో మా ఎంపీలు కూడా కేంద్ర మంత్రిగారిని కలవడం, ఢిల్లీలో నిరసనలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై మా ఎంపీలు తెచ్చిన ఒత్తిడితో, కంటితుడుపు చర్యగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి పంపిస్తామని అన్నారు. దాంట్లో ఈ వారం రోజుల నుండి 35 వేల మెట్రిక్ టన్నులు మన రాష్ట్రానికి వచ్చింది.

రైతాంగానికి విన్నపం…

కేంద్రం తరపున రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో జరిగిన ఆలస్యానికి చింతిస్తున్నాను. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు కారణం ఎవరో తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను, మా ముఖ్యమంత్రి గారు, మా ఎంపీలు, మా అధికారులు అందరం యూరియా సరఫరా కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అయినప్పటికి కేంద్రం చాతకానితనంతో యూరియా కొరత ఏర్పడిన విషయం వాస్తవము. కేంద్రం వాస్తవాలు అన్ని దాచిపెట్టి, వారి అసమర్థతను రాష్ట్రంపై రుద్దాలని చూస్తున్నారు.

“నిజం గడప దాటేలోపు, అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అన్నట్టు” యూరియా విషయంలో మా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు రైతులకు తెలిసేలోపు… ప్రతిపక్షాల అబద్దపు మాటలు రైతుల ముంగిట్లో నిలిచాయి.

రాజకీయ స్వార్థంతో బీ.ఆర్.ఎస్ చేస్తున్న యూరియా కొరత వీధి నాటకాలు, వాస్తవాలు దాచి రైతులను ఇబ్బందులు పాలుజేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పై వాస్తవాలు కుండ బద్దలు కొట్టి రైతాంగంకు చెబుతున్నాం.

రైతాంగం ఆందోళన చెందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై మీరు పెట్టుకున్న విశ్వాసం వమ్ము కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భరోసాగా ఉంటామని, రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడుతామని… ఓ రైతుగా వ్యవసాయ శాఖ మంత్రి గా స్పష్టం చేస్తున్నా..

తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి 5 55 20,000, 5 10,400 NFL కంపెనీ ద్వారా జూన్ లో 7,950, జులై లో 15,900 LMTs కేటాయించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!